ఈ మూడు గంటలు ఎవరు ఏమి అన్నా పట్టించుకోకండి, జాగ్రత్తగా ఉండండి. మనకి చిత్ర, వసంత్ ల సంతోషమే ముఖ్యం అంటూ భర్తకి జాగ్రత్తలు చెప్తుంది వేద. అలాగే శ్రీమతి గారు ఎలా చెప్తే అలా అంటూ వేదని ఆట పట్టిస్తాడు యష్. మాటల్లో పడి మిమ్మల్ని గమనించలేదు మీరు ఈ డ్రెస్ వేశారేంటి నేను మీకోసం స్పెషల్ డ్రెస్ కుట్టించాను అంటూ డ్రెస్ తీసుకువస్తుంది వేద. ఆ డ్రెస్ ని వేసుకున్న యష్ ని చూసి మురిసిపోతుంది వేద. నువ్వు రెడీ అవ్వవా అంటాడు యష్. నేను ఎంత సేపు.. రెండు నిమిషాలు అంటూ రెడీ అయి చూపిస్తుంది వేద.