దాన్ని నమ్మను... నా సక్సెస్ సీక్రెట్ ఇదే అంటున్న సంయుక్త మీనన్..!

Published : May 19, 2023, 11:23 AM ISTUpdated : May 19, 2023, 11:57 AM IST

పరిశ్రమలో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. ఒక హిట్ పడటమే చాలా కష్టం. సంయుక్త వరుసగా నాలుగు హిట్స్ ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె తన సక్సెస్ సీక్రెట్ బయటపెట్టారు.   

PREV
15
దాన్ని నమ్మను... నా సక్సెస్ సీక్రెట్ ఇదే అంటున్న సంయుక్త మీనన్..!


మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ వరుస విజయాలతో జోరు మీదున్నారు. భీమ్లా నాయక్ మూవీతో తెలుగులో అడుగుపెట్టిన సంయుక్త మీనన్ బింబిసారతో మెయిన్ లీడ్ హీరోయిన్ గా భారీ సక్సెస్ కొట్టింది. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ చిత్రం అలరించింది. 

25

బింబిసార అనంతరం ధనుష్ కి జంటగా బైలింగ్వల్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సార్ హిట్ మూవీగా నిలిచింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రానికి ఆదరణ దక్కింది. 

35


ఇక విరూపాక్షతో మరో బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన విరూపాక్ష వంద కోట్ల వసూళ్ల దిశగా పరుగులు పెడుతుంది. ఇటీవల విడుదలైన చిత్రాలన్నీ నెగిటివ్  తెచ్చుకోవడంతో విరూపాక్షకు మరింత కలిసొచ్చింది. సమ్మర్ ని క్యాష్ చేసుకుంది. 

45

ఈ క్రమంలో సంయుక్త మీనన్ లక్కీ హీరోయిన్ అంటూ జనాలు కొనియాడుతున్నారు. అయితే నేను లక్ ని నమ్మను, నా సక్సెస్ సీక్రెట్ ఇదే అంటూ సంయుక్త ఆసక్తికర కామెంట్స్ చేశారు. విజయం అనేది టాలెంట్, స్క్రిప్ట్ సెలక్షన్ మీదే ఆధారపడి ఉంటుంది. లక్ వలెనే విజయాలు 
దక్కుతున్నాయంటే నేను నమ్మను అన్నారు. 

 

55


ప్రస్తుతం ఆమె డెవిల్ మూవీలో నటిస్తున్నారు. సంయుక్తకు ఒంటరిగా ఉండటం ఇష్టమట. ఫ్రెండ్స్ ని పెద్దగా ఇష్టపడరట. ఖాళీ సమయం దొరికితే అందమైన ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లి ప్రశాంతంగా పుస్తకాలు చదువుకుంటారట. సంయుక్త భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

click me!

Recommended Stories