టాప్ యాంగిల్లో పాయల్ రాజ్ పుత్ కవ్వింపు చర్యలు.. మత్తు చూపులతో మైమరిపిస్తున్న యంగ్ బ్యూటీ..

First Published | May 19, 2023, 11:31 AM IST

యంగ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput)  బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిచ్చింది. ట్రెడిషనల్ వేర్ లోనూ కవ్వించేలా ఫోజులిస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. లేటెస్ట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 
 

సీరియల్ నటిగా కేరీర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం హీరోయిన్ గా అలరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆయా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
 

’ఆర్ ఎక్స్100‘ మూవీతో పాయల్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది. ఏకంగా బోల్డ్ పెర్ఫామెన్స్ తోనూ ఆకట్టుకుంది. యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుందీ బ్యూటీ. దీంతో వరుసగా ఆఫర్లు అందుకుంది.
 


ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, తీస్ మార్ ఖాన్, జిన్నా వంటి చిత్రాల్లో నటించి తెలుగు వారిని అలరించింది. కానీ ఈ సినిమాలు పాయల్ కు పెద్దగా గుర్తింపును తెచ్చిపెట్టలేదు. తన క్రేజ్ ను మరింతగా పెంచలేకపోయాయి. 

ఇదిలా ఉంటే పాయల్ తన కేరీర్ ను మళ్లీ గాడీలో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. క్రేజీ పోస్టులు పెడుతూ అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటోంది. ఈక్రమంలో గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తోంది.
 

తాజాగా పాయల్ పంచుకున్న ఫొటోలు కుర్ర గుండెల్ని కొల్లగొడుతున్నాయి. ట్రెడిషనల్ వేర్ ధరించిన పాయల్ చున్నీ తీసేసి టాప్ యాంగిల్లో అందాలను వెదజల్లింది. మత్తు కళ్లతో మైమరిపించింది. గుచ్చే చూపులతో చూపు తిప్పుకోకుండా చేసింది. ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

Latest Videos

click me!