బిగ్ బాస్ పై తిరగబడ్డ అభయ్.. తిండి కూడా పెట్టరా... అసలేం జరుగుతోంది హౌస్ లో..

First Published | Sep 19, 2024, 11:46 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఆటలు తారా స్థాయికి చేరుతున్నాయి. కంటెస్టెంట్స్ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నారు. బిగ్ బాస్ పై తిరగబడుతున్నారు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో రోజు రోజుకు పరిస్థితులు మారిపోతున్నాయి. టాస్క్ ల ఉదృతి పెరగడంతో పాటు.. తిండి విషయంలో కూడా టాస్క్ లతో ముడిపెట్టడంతో హౌస్ లో అంతా షాక్ అవుతున్నారు. అంతే కాదు బిగ్ బాస్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభాస్ ఫౌజీ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?
 

హౌస్ లో రెండు రోజుల నుంచి కోడి గుడ్ల టాస్క్ నడుస్తోంది. ఈ టాస్క్ కోసం అవుతున్న గొడవలు ఆడియన్స్ కు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందా అని ఉత్కంఠ పెంచుతుంది. అందులో ఈ హౌస్ లో ఉన్నవారిలో ఎక్కువమంది షార్ట్ టెంపర్ ఉన్నవారు  కావడంతో ఎవరు నోరు జారి ఏమంటారో తెలియడంలేదు.

ఫిజికల్ టాస్క్ లో పృధ్వి నిఖిల్ గట్టిగా ప్రయత్నిస్తుండగా.. సంచాలక్ గా మారిన నబిల్.. ఎక్కడికక్కడ టైట్ చేసేస్తున్నాడు. నబిల్ అభయ్ టీమ్ కావడంతో.. సహజంగానే అతని నిర్ణయాలలో కాస్త పార్శియాలిటీ కనిపిస్తోంది. రూల్స్ పేరుతో నిఖిల్ టీమ్ కు గుడ్లు అందకుండా చేస్తున్నాడు అభయ్. 

అల్లు అర్జున్ - రాజమౌళి కాంబోలో సినిమా ఎందుకు రాలేదు..?
 


ఇక బిగ్ బస్ లో మొదటి నుంచి తిండి పంచాయితీ నడుస్తోంది. తినే తిండి విషయంలో కూడా టాస్క్ లు పెట్టి బిగ్ బాస్ ఇబ్బంది పెడుతున్నాడంటూ.. టీమ్ సభ్యులు వాపోతున్నారు. ఆ విషయంలో అందరు భయపడలేక పోతున్నారు. కాని అభయ్ మాత్రం ధైర్యంగా బిగ్ బాస్ పై కామెంట్ చేశాడు. 

బిగ్ బాస్ ఈ వారం రెండు టీమ్ లకు వంట కోసం 14 గంటలు మాత్రమే ఇచ్చాడు. రోజు కొంత టైమ్ వాడుకుని వంట చేసుకోవాలి అన్నారు. దాంతో రెండు టీమ్ లు కలిసి రోజుకు గంట గంటన్నర వాడుకుని వంట చేసుకుంటున్నారు. కాని ఈరోజు ఆ అవకాశం కూడా లేకుండా.. ఒక్క టీమ్ మాత్రమే వంట చేసుకోవాలి.. అది కూడా ముగ్గురే వంట చేయాలి అని టైమ్ పెట్టారు బిగ్ బాస్. 

దర్జాగా బతికిన భానుమతి.. చివరి రోజుల్లో అంత హింస అనుభవించిందా..?
 

ఈ రకంగా రోజు రోజుకు ఆటను టైట్ చేస్తున్నాడు బిగ్ బాస్. దాంతో అభయ్ నవీన్ కు చిర్రెత్తుకొచ్చింది. తిండి విషయంలో ఈ ఆటలేంటి అంటూ... సర్రున పైకి లేచాడు అభయ్.. తిండి విషయంలో ఇలా ఆటలు ఆడించడం కరెక్ట్ కాదు.. ఏంటి ఇది అంటూ ఫైర్ అయ్యాడు. అభయ్. 

ఇక శక్తి టీమ్ లో నిఖిల్, పృధ్వి ఉండటం.. వాళ్ళు ఎక్కువ మంది ఉండటంతో ఎక్కువ గుడ్లు సాధించారు.  ఈ విషయంలో కాంతార టీమ్ పొరపాట్ల వల్ల వారికి గుడ్లు లభించడం లేదు. ప్రేరణ, యష్మి తొందర పడుతున్నారు కాని.. ఆట మీద దృఫ్టి పెట్టడంలేదు. 

నాగార్జునకు నైట్ నిద్ర పట్టాలంటే.. అది తినాల్సిందే
 

టీమ్ లీడర్ అభయ్ మొత్తానికి చేతులెత్తేయడం చిరాకు తెప్పిస్తుంది. ఈ విషయంలో మణికంఠ గట్టిగా ఫైట్ చేస్తున్నాడు. నబిల్ లేకపోవడంతో టీమ్ ఇంకా వీక్ అయ్యింది. సో ఎగ్ టాస్క్ కంప్లీట్ అయ్యే వరకూ శక్తి టీమ్ మొత్తానికి విన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మోక్షజ్ఞ కోసం మహేష్ బాబు హీరోయిన్

Latest Videos

click me!