ప్రభాస్ ఫౌజీ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..? షాక్ అవుతారు..

First Published | Sep 19, 2024, 9:35 PM IST

కల్కీ విజయం ఇచ్చిన బలంతో దూసుకుపోతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. వరుసగా పాన్ ఇండియా సినిమాలు సైన్ చేస్తున్నాడు. ఈక్రమంలో ప్రభాస్ రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. 

ప్రభాస్ పాన్ ఇండియా హీరో... బాహుబలి తరువాత ఇండియా వైడ్ గా అతని పాపులారటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.    చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్న ప్రభాస్ సలార్ తో మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక కల్కి సినిమాతో సాలిడ్ హీట్ ను తన ఖతాలో వేసుకున్నాడు. బాహుబలి సినిమాల తరువాత ప్రభాస్ కు ఆ రేంజ్ లో పడిన హిట్ అంతే ఇదే. 

Also Read: దర్జాగా బతికిన భానుమతి.. చివరి రోజుల్లో అంత హింస అనుభవించిందా..?

Prabhas, Hanu , Iman Esmail

ఇక ఈ జోష్ తో రెచ్చిపోతున్నాడు పాన్ఇండియా స్టార్.. వరుసగా నాలుగైదు  సినిమాలు ప్రభాస్ లైన్ అప్ చేశాడు. మరో మూడు నాలుగేళ్ళు ప్రభాస్ ఫుల్ బిజీగా గడపబోతున్నాడు.

ఈక్రమంలోనే ఆయన మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్..  సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్, ప్రశాంత్ నీల్ తో సలార్ 2, హను రాఘవపూడితో ఫౌజి మూవీస్ సెట్ చేశాడు. అయితే హను రాఘవపూడితో చేసే సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

ఇంకా ఈమూవీ టైటిల్ ను వారు అనౌన్స్ చేయలేదు. కాగా ఈమూవీ షూటింగ్ సీక్రెట్ గా మధురైలో జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాని ఇందులో క్లారిటీ లేదు. మరో వైపు మరుతీతో నటిస్తోన్న రాజా సాబ్ షూటింగ్ మాత్రం నిర్విరామంగా జరుగుతోంది. 

Also Read: నాగార్జునకు నైట్ నిద్ర పట్టాలంటే.. అది తినాల్సిందే


ఇక  ప్రస్తుతం ప్రభాస్ కు సబంధించిన ఓన్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ప్యాన్ ఇండియా హీరోగా వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు ప్రభాస్.

సినిమా హిట్ అయినా.. ప్లాప్ అయినా.. ప్రభాస్ రెమ్యూనరేషన్ లో ఎటువంటి మార్పు లేదు. అయితే హను రాఘవపూడితో చేయబోయే సినిమాకోసం ప్రభాస్ తీసుకునే పారితోషికం ప్రస్తుతం హాట్ టాపక్ అవుతోంది. 

Also Read:మోక్షజ్ఞ కోసం మహేష్ బాబు హీరోయిన్


ఇందులో నిజం ఎంత ఉంది తెలియదు కాని.. ప్రభాస్ మాత్రం ఈసినిమా కోసం 250 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ విషయంలో క్లారిటీ లేదు కాని.. కల్కి సినిమాతో ప్రభాస్ డిమాండ్ మరింతగా పెరిగిపోయింది.

ఈక్రమంలో ఆయన కోసం బాలీవుడ్ , టాలీవుడ్ దర్శకులు చాలామంది క్యూ కడుతున్నారు. ఇక వరుసగా రాజా సాబ్, ఫౌజీ సినిమాలు హిట్ అయితే.. ప్రభాస్ ను పట్టుకోవడం కష్టమే అవుతుంది. ఇప్పటికే ఆయన హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ అందుకున్నా కాని..

పాపులారిటీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆయన వరుసగా సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేశాడు. ప్రభాస్ ఇమేజ్ ఇంకాస్త పెరిగింది తప్ప తరగలేదు. సో ముందు ముందు  ఎలా ఉంటుందో చూడాలి. 

Also Read:అల్లు అర్జున్ - రాజమౌళి కాంబోలో సినిమా ఎందుకు రాలేదు..?

ఇక ప్రభాస్ రాజా సాబ్ ను వచ్చే ఏడాది క్యార్టర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. స్పిరిట్ మూవీ కూడా త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్టు సమాచారం. ఇక ప్రభాత్ నీల్ తో  చేయాల్సిన సలార్ 2 పరిస్థితి ఏంటీ అనేది చూడాలి. 

ఎందుకుంటే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడా.. ప్రభాస్ తో ముందు చేస్తాడా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్టీఆర్ దేవర సినిమా ఈనెల 27 రిలీజ్ కాబోతోంది. ఈమూవీ రిలీజ్ తరువాత తారక్.. ప్రశాంత్ నిల్ ప్రాజెక్ట్ లోకి వెళ్తాడని టాక్. మరి అందులో నిజమెంతో చూడాలి. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి

Latest Videos

click me!