Aasmaan Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్‌‌ కొత్త మూవీ ఆస్మాన్‌ టీజర్‌ వచ్చింది.. వామ్మో ఇలా ఉందేంటి?

Published : Sep 16, 2026, 01:59 PM IST

శ్రీహరి కొడుకు మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ `ఆస్మాన్‌`. పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌ విడుదలైంది. సరికొత్తగా సాగుతూ ఆకట్టుకుంటోంది.

PREV
14
ఆస్మాన్‌ తో రాబోతున్న మేఘాంశ్‌ శ్రీహరి

శ్రీహరి కొడుకు మేఘాంశ్‌.. ఏడేళ్ల క్రితమే హీరోగా పరిచయం అయ్యాడు. `రాజ్‌ దూత్‌` చిత్రంలో హీరోగా పరిచయం కాగా ఈ మూవీ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత కొంత గ్యాప్‌ తో `మిస్టర్‌ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా` చిత్రంలో కనిపించాడు. ఇది కూడా మెప్పించలేకపోయింది. ఆ వెంటనే `కోతి కొమ్మచ్చి` సినిమాలో నటించాడు. దీనికి సతీష్‌ వేగ్నేశ దర్శకుడు. ఇవేవీ ఆయనకు పేరుని, గుర్తింపుని తీసుకురాలేకపోయాయి. ఈ క్రమంలో ఇప్పుడు మేఘాంశ్‌.. `ఆస్మాన్‌` అనే మూవీలో నటిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.

24
ఆస్మాన్‌ టీజర్‌ వచ్చింది

తాజాగా ఈ మూవీ టీజర్‌ విడుదలైంది. ఇదొక మిస్టరీయస్‌ థ్రిల్లర్‌లాగా కనిపిస్తుంది. క్రిస్టియన్‌, చర్చ్‌ నేపథ్యంలో టీజర్‌ ప్రారంభమైంది. ఇందులో కొంత మంది వైట్‌ డ్రెస్‌లో ఉన్నారు. వారిని ఒక వాయిస్‌ శాసిస్తుంది. అది హీరో వాయిస్‌లా ఉంది. `మీరు ఇప్పుడు గొంగలిపురుగు దశలో ఉన్నారు. అది దాటి సీతాకోక చిలుక దశలోకి మారాలి, దానికి మార్గం నేనే అంటూ గట్టిగా అరుస్తున్నాడు. ఆ సమయంలో కొందరు తెల్లటి దుస్తుల్లో ఉన్నవారి శవం చుట్టూ తిరిగారు. అనంతరం పొలాల్లో ఒక వ్యక్తిని రెడ్‌ దుస్తుల్లో ఉన్న కొందరు వెంటాడుతుంటారు. ఈ క్రమంలో మేఘాంశ్‌ ఎంట్రీ ఇచ్చాడు. చర్చ్‌లోనే ఆయన ఎంట్రీ జరిగింది. ఈ క్రమంలో ఒక దిష్టి బొమ్మ, నటుడు శుభోదయం సుబ్బారావు వంటి కొన్ని పాత్రలను పరిచయం చేశారు.

34
లవ్‌, హర్రర్‌, థ్రిల్లర్‌, సైకో వంటి అంశాల మేళవింపుగా ఆస్మాన్‌

అనంతరం అదే వాయిస్‌.. మీరంతా కనిపించే చీకట్లో ఉన్నారు, అదే నిజం అని మళ్లీ అరుస్తున్నారు. ఇంతలోనే హీరోహీరోయిన్ల లవ్‌ ట్రాక‌‌ని చూపించారు. అంతలోనే హీరో కొందరిని కొట్టడం, ఆయనకు కల రావడం, పోలీసులు వెంటాడటం వంటి సీన్లతో ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఆర్‌ఆర్‌ అదిరిపోయింది. సస్పెన్స్ థ్రిల్లర్‌, హర్రర్‌ అంశాల మేళవింపుగా ఈ సినిమా సాగబోతుందని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. మొత్తంగా ఇందులో చాలా జోనర్స్ ఉన్నాయి. లవ్‌ ట్రాక్‌, ఫ్యామిలీ అంశాలు, మర్డర్‌ మిస్టరీ, హర్రర్‌ ఎలిమెంట్లు, రెగ్యూలర్‌ మాస్‌ కమర్షియల్‌ ఎలిమెంట్లు ఉన్నాయి. సరికొత్తగా ఉంది. తెలుగులో ఇదొక కొత్త తరహా సినిమాలా అనిపిస్తుంది. ఒక వ్యక్తి కొందరి వ్యక్తులను తన ఆధీనంలోకి తీసుకొని వారిని తనకు నచ్చినట్టు ఆడించడమే ఈ మూవీ అని తెలుస్తోంది. హాలీవుడ్‌ స్టయిల్‌ మేకింగ్‌ కనిపిస్తుంది.

44
పాన్‌ ఇండియా మూవీగా ఆస్మాన్‌

మేఘాంశ్‌ ఒక కొత్త తరహా కథతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారని అర్థమవుతుంది. దీనికి రామ్‌ నందన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మేఘాంశ్‌కి జోడీగా రాయంచు కొక్కుర హీరోయిన్‌గా నటిస్తోంది. క్లింకార సెల్యులాయిడ్స్ పతాకంపై కొండరు వెంకటేష్‌, శ్రీకాంత్‌ మన్నెం నిర్మించారు. ప్రశాంత్‌ విహారి సంగీతం అందిస్తున్నారు. దీన్ని పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ని ప్రకటించే అవకాశం ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories