Jason Sanjay: `సిగ్మా` డిజాస్టర్‌ ఎఫెక్ట్.. హీరోగా విజయ్‌ కొడుకు జాసన్‌ సంజయ్‌, డైరెక్టర్‌ ఎవరంటే?

Published : Oct 30, 2026, 07:58 PM IST

'సిగ్మా' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన జాసన్ సంజయ్, తన తదుపరి చిత్రంలో హీరోగా కనిపించనున్నారు. మొదటి సినిమా ఫలితం నేపథ్యంలో ఆయన ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఆ వివరాలు బయటకు వచ్చాయి.

PREV
13
దర్శకుడిగా సక్సెస్‌ కాలేకపోయిన జాసన్ సంజయ్

తమిళనాడు సీఎం, దళపతి విజయ్‌ కొడుకు జాసన్‌ సంజయ్‌ ఆ మధ్య దర్శకుడిగా వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. సందీప్‌ కిషన్‌ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదలైంది. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో జాసన్‌ సంజయ్‌పై చాలా విమర్శలు వచ్చాయి. దర్శకుడుగా సక్సెస్‌ కావడం కష్టమనే టాక్‌ వచ్చింది. డైరెక్షన్‌ వదిలేసి హీరోగా సినిమా చేసుకోమని నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జాసన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారట.

23
హీరోగా ఎంట్రీ ఇస్తోన్న జాసన్‌ సంజయ్‌

జాసన్‌ సంజయ్‌ ఇప్పుడు హీరోగా టర్న్ తీసుకుంటున్నారట. ఆయన హీరోగా ఎంట్రీకి రంగం సిద్ధమయ్యిందని సమాచారం. ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో నటనపై తన ఆసక్తిని కూడా పంచుకోవడంతో, త్వరలోనే ఆయన నటనలో కొత్త సినిమా రాబోతోందనే అంచనాలు పెరిగాయి. అంతకుముందు, సంజీవ్ దర్శకత్వంలో, లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న చిత్రంతో జాసన్ సంజయ్ హీరోగా అరంగేట్రం చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఇప్పుడు ఆయన తొలి సినిమాకు సంబంధించి మరో సమాచారం వెలువడింది.

33
అట్లీ నిర్మాణంలో జాసన్ సంజయ్?

ప్రదీప్ రంగనాథన్ నటించిన 'డ్యూడ్' చిత్రానికి దర్శకత్వం వహించిన కీర్తిశ్వరన్, జాసన్ సంజయ్ తొలి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్‌ సంగీతం అందించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు, నిర్మాత అట్లీ నిర్మించనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. జాసన్ సంజయ్ కొత్త సినిమా ప్రకటన 2026లో దీపావళి సందర్భంగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, జాసన్ సంజయ్ తన తండ్రి విజయ్ లాగా చిత్ర పరిశ్రమలో హీరోగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటాడని అభిమానుల్లో ఒక అంచనా ఉంది. దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన జాసన్ సంజయ్, ఆ తర్వాత నటనలో తనదైన ముద్ర వేస్తాడా లేడా అనేది వేచి చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories