80 సినిమాలు చేసిన హీరోయిన్, స్టార్ క్రికెటర్ తో అఫైర్, 50 ఏళ్లు దాటినా బ్యాచిలర్ గా జీవిస్తోన్న బ్యూటీ ఎవరు?

Published : Feb 20, 2025, 06:40 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు బ్యాచిలర్లుగానే మిగిలిపోయారు. వారిపై అఫైర్ల రూమర్లు మాత్రం తప్పలేదు, స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఓ సీనియర్  బ్యూటీ 50 ఏళ్ళు దాటినా పెళ్ళి చేసుకోలేదు. ముగ్గురు స్టార్లతో అఫైర్ల రూమర్లను మాత్రం మూటగట్టుకుంది. ఇంతకీ ఆమె ఎవరు..?   

PREV
16
80 సినిమాలు చేసిన హీరోయిన్, స్టార్ క్రికెటర్ తో అఫైర్, 50 ఏళ్లు దాటినా బ్యాచిలర్ గా జీవిస్తోన్న బ్యూటీ ఎవరు?

ఆమె ఓ స్టార్ హీరోయన్ దాదాపు 90 సినిమాల వరకూ చేసింది. ఇండియాల్ దాదాపు 10 భాషల్లో సినిమాలు చేసింది. అన్ని భాషల్లో స్టార్ హీరోయిన్ల సరసన మెరిసింది. సౌత్ నార్త్ అన్ని చోట్ల స్టార్ డమ్ ను సాధించింది. అంతే కాదు ఆమె చేసిన సినిమాల్లో దాదాపు అన్నీ సూపర్ హిట్లే. తన కెరీర్ లో ప్లాప్ సినిమాలను చాలా తక్కువగా చూసింది. పెళ్ళి పెటాకులు లేకుండా ఓంటరి జీవితం గడుపుతున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? 

Also Read: మోహన్ బాబుకు ఇష్టమైన కొడుకు ఎవరు? మంచు విష్ణు, మనోజ్ ఆస్తి గొడవల్లో ఆయన ఎవరి వైపు

26
Nagma

ఇంతకీ ఆమె ఎవరో కాదు ఒకప్పటి స్టార్ బ్యూటీ నగ్మ. అవును నగ్మ అందరికి గుర్తుండే ఉంటుంది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్, సుమన్, ఇలా స్టార్ హీరోలందరిసరసన నటించి మెప్పటించింది. తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో కూడా మెరిసిన నగ్మ.. బాలీవుడ్ లో కూడా స్టార్ ఇమేజ్ ను  తెచ్చుకుంది. హీరోయిన్ గా ఆఫర్లు తగ్గిన వెంటనేసినిమాలు మానేసింది నగ్మ. తన చెల్లెళ్లు ఇద్దరు ఇండస్ట్రీలో హీరోయిన్లు గా రాణించిన సంగతి తెలిసిందే. ఇక ఈ బ్యూటీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే.. ?

Also Read:100 రోజుల్లో కేజీఎఫ్, సలార్ రికార్డులు గల్లంతు చేసే హీరో ఎవరో తెలుసా? షాక్ అవుతారు

36
Nagma

నగ్మా ఫ్యామిలీలో రకరకాల  మతాలు కలిసి ఉంటాయి.  ఆమె తండ్రి అరవింద్ మొరార్జీ హిందూ, తల్లి షామా మాత్రం కాజీ ముస్లిం. తండ్రి వ్యాపారవేత్త. అతని పూర్వీకులు జైసల్మేర్‌కు చెందినవారు. ముంబైకి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక . తల్లి ముస్లీం అయినా.. ఆమె ఫ్యామిలీ మాత్రం స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం కావడం విశేషం.

షామా, అరవింద్ 1969లో పెళ్లి చేసుకున్నారు. నగ్మా కడుపులో ఉండగానే 1974లో విడిపోయారు. ఆ తర్వాత షామా, సినీ నిర్మాత చందర్ సదానాని పెళ్లి చేసుకుంది. వీళ్లకు జ్యోతిక, రోషిణి (రాధిక) అనే ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 

Also Read:ఫస్ట్ మూవీతోనే 100 కోట్లు కొల్లగొట్టిన యంగ్ హీరో ఎవరో తెలుసా?

46
Jyothika and Nagma

నగ్మ ఇద్దరు చెల్లెల్లు  హీరోయిన్లుగా చేశారు. అందులో నగ్మ పెద్ద చెల్లెలు జ్యోతిక స్టార్ హీరోయిన్ గా సౌత్ లోవెలుటు వెలిగింది. తమిళ స్టార్ హీరో సూర్యాను పెళ్ళాడింది.  ఇక నగ్మాకు తన తండ్రి అంటే చాలా ఇష్టం. తండ్రి 2005 లో మరణించగా.. అతను మరణించే వరకూ అతనికి చాలా దగ్గరగా ఉంది. తల్లి దగ్గర కంటే తండ్రి దగ్గరే నగ్మ ఎక్కువగా ఉండేది. ఇక సినిమాలు చేయడానికి మాత్రం నగ్మను ప్రోత్సహించింది తల్లి షామానే. 
 

56
Nagma

1990 లో సల్మాన్ ఖాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నగ్మ..  అప్పటి నుంచి కెరీర్ లో తిరిగి చూసుకోలేదు. ఆతరువాత ఆమె చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే, ఇక సౌత్ లో అయితే.. భాషా, రౌడీ అల్లుడు, రిక్షావోడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంది నగ్మ. సౌత్ ఆడియన్స్ లో ఆమె క్రేజ్ ఎలా ఉండేదంటే నగ్మకు ఏకంగా గుడికట్టేశారు అంత ఇష్టపడ్డారు ఇక్కడి ఆడిమన్స్. 

66
Nagma

ఇక నగ్మ దాదాపు 80 కి పైగా సినిమాల్లో నటించింది. 10 భాషల్లో నటించింది. అ భాషలు మాట్లాడగలదు కూడా. ఇక ఫెయిడ్ అవుట్ అయిన తరువాత సినిమాలు వదిలేసిన నగ్మ.. ఆతరువాత రాజకీయాల్లో చేరింది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది.

హీరోయిన్ గా ఉన్న కాలంలో స్టార్ క్రికెటర్ గంగూలితో ఆమెకు అఫైర్ ఉందని రూమర్లు గట్టిగా వినిపించాయి. మరో ఇద్దరు స్టార్లతో ఆమె డేటింగ్ చేసిందని వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ప్రస్తుతం 50 ఏళ్లు దాటిన నగ్మ.. పెళ్ళి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. పోలిటిక్స్ లో బిజీ అయిపోయింది. 

Read more Photos on
click me!

Recommended Stories