Baapu Review: `బాపు` మూవీ రివ్యూ, రేటింగ్‌

Published : Feb 20, 2025, 05:50 PM IST

తెలంగాణ పల్లెల నేపథ్యంలో వచ్చిన మరో మూవీ `బాపు`. బ్రహ్మాజీ, ఆమని, సుధాకర్‌ రెడ్డి, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.   

PREV
15
Baapu Review: `బాపు` మూవీ రివ్యూ, రేటింగ్‌
baapu movie review

 బ్రహ్మాజీ, ఆమని, శ్రీనివాస్‌ అవసరాల, ధన్య బాలకృష్ణన్‌, `బలగం` సుధాకర్‌రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ `బాపు`. దయా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కామ్రేడ్‌ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీర బ్యానర్స్ పై రాజు సీహెచ్‌, భానుప్రసాద్‌ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ముందుగా ప్రీమియర్స్ ప్రదర్శించారు. కామెడీ పాత్రలతో అలరించే బ్రహ్మాజీ ఇందులో సీరియల్‌ రోల్‌లో కనిపించారు. దీనికితోడు తెలంగాణ కల్చర్‌ నేపథ్యంలో తండ్రి కథతో వస్తోన్న ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఉందా? సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

25
baapu movie review

కథః
మల్లయ్య(బ్రహ్మాజీ), ఆయన భార్య(ఆమని) వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. పత్తి పంటనే వారికి ఆధారం. వీరికి కూతురు వరలక్ష్మి(ధన్య బాలకృష్ణ) చదువుకుంటుంది, కొడుకు రాజు(మణి) ఆటోని నడిపిస్తుంటాడు. తండ్రి రాజు(సుధాకర్‌ రెడ్డి) ఏం పని చేయక ఇంట్లోనే ఉంటూ ప్రతిదీ సాగిస్తుంటాడు. మల్లేష్‌ వ్యవసాయం కోసం అప్పులు చేయాల్సి వస్తుంది.

ఈ సారి పంట బాగా పండుతుంది. పత్తి అమ్మితే బాగా డబ్బులు వస్తాయని, అప్పులు తీర్చొచ్చు అని భావిస్తారు. కానీ మార్కెట్‌కి పత్తి తీసుకెళ్లగా, అక్కడ మద్దతు ధర కోసం స్ట్రైక్‌ జరుగుతుంటుంది. దీంతో కొనుగోలు జరగదు. పత్తిని మార్కెట్‌లోనే ఉంచాల్సి వస్తుంది. ఓ రోజు రాత్రి బాగా వర్షం పడి పత్తి మొత్తం తడిసిపోతుంది.

దీంతో మల్లేష్‌ కుంటుంబం ఆశలన్నీ గల్లంతు అవుతాయి. అప్పుల వాళ్లు ఇంటి మీద పడతారు. చేసేదేం లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అది విఫలమవుతుంది. ఇక అప్పులు ఎలా తీర్చాలనే బాధలో ఉంటారు. ఈ క్రమంలో ఫ్యామిలీ అంతా కలిసి ఓ ప్లాన్‌ చేస్తారు? మరి ఆ ప్లానేంటి?

తండ్రిని ఎందుకు చంపాలనుకుంటారు? రాజు లవ్‌ స్టోరీ ఏంటి? లెక్చరర్‌(అవసరాల శ్రీనివాస్‌)తో వరలక్ష్మి ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగింది? మల్లేష్‌ ప్లాన్‌ ఎలా బెడిసి కొట్టింది? వీరి కథకి ఊర్లో బంగారు విగ్రహానికి ఉన్న లింకేంటి? చివరికి కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగిలిన సినిమా. 
 

35
baapu movie review

విశ్లేషణః 
తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణ పల్లెలను, అక్కడి కల్చర్‌ని ఆవిష్కరిస్తూ `బలగం` సినిమా వచ్చింది. పెద్ద హిట్‌ అయ్యింది. తెలుగు సినిమాల్లో తెలంగాణ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలచింది. ఆ తర్వాత చాలా సినిమాలు వస్తున్నాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెబుతున్నాయి. తెలుగు తెరపై తెలంగాణకు ఓ గుర్తింపు, గౌరవాన్ని తీసుకొస్తున్నాయి.

అయితే కేవలం తెలంగాణ కల్చర్‌తోనే సినిమా చేస్తే వర్కౌట్‌ కాదు, బలమైన కథ కావాలి. `బలగం`లో బలమైన ఎమోషన్స్ ని, ఫ్యామిలీ రిలేషన్స్ ని కళ్లకి కట్టినట్టు చూపించారు. సక్సెస్‌ అయ్యారు. అన్నీ అలానే అవుతాయనుకుంటే పొరపాటే. సరైన కథ, కథనాలు కూడా ఉండాలి. తాజాగా రూపొందించిన `బాపు` లో ఆ ఎలిమెంట్లు లోపించాయి.

సినిమాగా ఇది స్వచ్ఛమైన తెలంగాణ పల్లెలు, పత్తి రైతుల ఆర్థిక ఇబ్బందులు, కుటుంబాలు ఎలా ఉంటాయి? ఎలాంటి ఇబ్బందులు పడతాయి. అప్పుల బాధతో ఎలా సతమతమవుతాయనే విషయాన్ని ఇందులో చూపించారు. సన్నివేశాల పరంగా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది. చాలా సన్నివేశాలను చూస్తుంటే మన రియల్‌ లైఫ్‌ని గుర్తు చేస్తుంటాయి.  

ఇంత వరకు బాగానే ఉంది, కానీ బలమైన ఎమోషన్‌ లేదు, డ్రామా రక్తికట్టలేదు, `బలగం` ఫ్లేవర్‌ తీసుకున్నారు తప్పితే, వాటి తాలుకూ రియాలిటీ, ఫీల్‌, ఎమోషన్‌ మిస్‌ అయ్యింది. ఎమోషన్ సినిమాలో క్యారీ కాలేదు, దీంతో చాలా సీన్లు తేలిపోయాయి. దీంతో ఆడియెన్స్ కి ఆ ఎమోషన్‌ ఎక్కలేదు.   

కొన్ని సన్నివేశాలు రియలిటీగా ఉన్నా, లాజిక్‌లెస్‌గా ఉన్నాయి. ఒక్కో సీన్‌ తర్వాత ఒక్కో సీన్‌ వచ్చిపోతున్నట్టుగా ఉన్నాయి. సీన్లు పండకపోవడంతో ఆ కిక్‌ మిస్‌ అయ్యింది. చాలా చోట్ల ఫన్‌ సీన్లు ఉన్నాయి, కానీ తెరపై అవి వర్కౌట్‌ కాలేదు. అప్పుల బాధలో డెప్త్ లేదు, అలాగే కొడుకు ఆటో కష్టాల్లో కూడా సీరియస్‌ నెస్‌ కనిపించలేదు. అతని ప్రేమలోనూ ఫీల్‌ కూడా తగ్గింది. కాకపోతే చాలా రియాలిటీగా ఉంది.

మరోవైపు కూతురు ప్రేమ, పై చదువుల కోసం సిటీ వెళ్లాలనుకునే ప్రయత్నం కూడా జస్ట్ ఓకే అనిపించేలా ఉంది. మరోవైపు అప్పులు ఇచ్చిన వాళ్లు ఇంటికి మీదకు రావడం వంటి సన్నివేశాలు ఓకే, కానీ తండ్రిని చంపాలనుకునే ప్లాన్‌, ఈ క్రమంలో చోటు చేసుకునే డ్రామా లోనూ డెప్త్ మిస్‌ అయ్యింది. ఓవర్‌ డ్రామాగానూ అనిపిస్తుంది.

దీని తాలూకూ కామెడీ ఫర్వాలేదనిపిస్తుంది. కానీ ఆ ఫన్‌ కి ఇంకా స్కోప్‌ ఉన్నా సరిగా వాడుకోలేదు, రాసుకోలేదు. క్లైమాక్స్ కాస్త ఎమోషనల్‌గా అనిపిస్తుంది. అయినా ఆ మోతాదు సరిపోలే. ఇలా కథ, కథనం, కామెడీ, ఎమోషన్స్, డ్రామా వంటివి లైటర్‌ వేలోనే సాగాయి. ఆడియెన్స్ ఫీలయ్యేలా లేవు.

దీనికితోడు చాలా సన్నివేశాలు సిల్లీగా ఉంటాయి. మరింత ఫోకస్‌గా కథనాన్ని రాసుకుని, మరింత బాగా తీసి ఉంటే మరో `బలగం` సినిమా అయ్యేది. ఫైనల్‌గా చెప్పాలంటే బాపు అనే పదంలో ఓ ఎమోషన్‌ ఉంటుంది. అదే ఇందులో మిస్‌ అయ్యింది. 
 

45
baapu movie review

నటీనటులుః 
మల్లేష్‌గా రైతు పాత్రలో బ్రహ్మాజీ బాగా చేశాడు. నిజమైన రైతుగా జీవించాడు. ఆయన వేషాధారణ, హవభావాలు కూడా అంతే సహజంగా ఉన్నాయి. తనదైన నటనతో ఆయన అదరగొట్టాడు. ఆయన భార్య పాత్రలో ఆమని ఇరగదీసింది. రియాలిటీకి దగ్గరగా చేసింది. కూతురు పాత్రలో ధన్య బాలకృష్ణ కూడా బాగా సెట్‌ అయ్యింది. అంతే బాగా చేసింది.

కొడుకు రాజుగా మణి అదరగొట్టాడు. పర్‌ఫెక్ట్ కాస్టింగ్‌ అనిపించాడు. ఇక మల్లేష్‌ తండ్రిగా బలగం సుధాకర్‌ రెడ్డి పాత్ర సినిమాకి హైలైట్‌. ఆ పాత్ర చుట్టూనే సినిమా సాగుతుంది. ఆయన బాగా చేశాడు. నవ్వించాడు. శ్రీనివాస్‌ అవసరాల కాసేపు మెరిశారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి. 

55
baapu movie review

టెక్నీషియన్లుః 
సినిమా టెక్నీకల్‌గా ఫర్వాలేదు. వాసు పెండం కెమెరా వర్క్ బాగుంది. చాలా సహజంగా ఉంది. పల్లె అందాలను అంతే బాగా చూపించారు. కెమెరాతో విజువల్స్ కి ప్రాణం పోశాడు. ఆర్‌ఆర్‌ ధృవన్‌ మ్యూజిక్‌ ఫర్వాలేదు. ఆర్‌ఆర్‌ విషయంలో మరింత కేర్‌ తీసుకోవాల్సింది. పాటలు `బలగం` మూవీని తలపిస్తున్నాయి. ఇక నిర్మాతలు సినిమా కంటెంట్‌ మేరకు ఖర్చుచేశారని చెప్పొచ్చు.

దర్శకుడు దయా ఎంచుకున్న కథ బాగుంది. తండ్రి విలువని, పత్తి రైతుల అప్పుల బాధలను, బంగారు విగ్రహం దొరికితే అది తెచ్చే అనర్థాలు, ప్రేమలో మోసాలు చాలా సహజంగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ మరింత బలంగా, మరింత బాగా పండేలా తీయాల్సింది. ఆ విషయంలో సక్సెస్‌ కాలేకపోయాడు. సినిమాలో ఎమోషన్స్, డ్రామా పండితేనే  వర్కౌట్‌ అవుతుంది. ఇందులో అదే లోపించింది.  

ఫైనల్‌గాః `బాపు`లో ఎమోషన్‌ మిస్‌. మరింత బలంగా రాసుకోవాల్సింది, తీయాల్సింది.  
రేటింగ్‌ః 2.25
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories