Vijay Rashmika : ఏడేళ్ల తర్వాత ఏడడుగులు !

Published : Oct 04, 2025, 12:32 AM IST

విజయ్ దేవరకొండ, రష్మిక  మందన్న నటించిన గీత గోవిందం సినిమా 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. వీరిద్దరు ఒక్కటి కావడానికి ప్రధాన కారణంగా నిలిచిన సినిమా ఇది. అప్పుడు రీల్ లైఫ్ లో మెరిసిన ఈ జోడీ ఇప్పుడు రియల్ లైఫ్ లో ఏడడుగులు వేయబోతోంది.

PREV
15
7 ఏళ్లు పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ రష్మిక రొమాంటిక్ కామెడీ గీత గోవిందం

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ చిత్రం గీత గోవిందం 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2018 ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైంది. విజయ్ కెరీర్ లో పెద్ద హిట్‌గా నిలిచి, బాక్సాఫీస్‌ వద్ద ఘనవిజయం సాధించింది. రష్మికకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

అయితే, ఈ సినిమా విడుదలై 7 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో జోడీగా నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన.. రియల్ లైఫ్ లో కూడా వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నారు. తాజాగా వీరి నిశ్చితార్థం సీక్రెట్ గా జరిగింది.

25
దర్శకుడు పరశురామ్‌కు ఆరో చిత్రం గీత గోవిందం

గీత గోవిందం పరశురామ్ కెరీర్‌లో ఆరో చిత్రం అయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అంతకుముందు ఆయన యువత, అంజనేయులు, సోలో, సరొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రానికి కథా రచన గిరిధరన్ అందించగా, ఇది పరశురామ్‌తో ఆయనకు మొదటి చిత్రం.

35
విజయ్–రష్మిక ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ మస్తు పాపులారిటీ

గీత గోవిందం సినిమా విజయ్ దేవరకొండ కెరీర్‌లో తొమ్మిదవ చిత్రం కాగా, హీరోగా ఏడవ చిత్రం. రష్మిక మంధానకి ఇది ఐదవ సినిమా. తెలుగులో రెండవ చిత్రం మాత్రమే. వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంది. వీరిద్దరూ జోడీగా నటించిన మొదటి సినిమా ఇది. అప్పటి నుంచే వీరి మధ్య పరిచయం ఏర్పడింది.

45
విజయ్–రష్మికల గీత గోవిందంకు అవార్డులు

మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటింగ్ అందించగా, ఇది పరశురామ్‌తో కలిసి తీసిన ఐదో సినిమా. సినిమాటోగ్రఫీకి ఎస్. మణికందన్ పని చేశారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 8వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌లో 9 నామినేషన్లు పొందగా, విజయ్ దేవరకొండ క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ యాక్టర్ – తెలుగు అవార్డు గెలుచుకున్నారు.

2019లో జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో 10 నామినేషన్లు వచ్చి, 2 అవార్డులు సాధించింది. అందులో రష్మిక మంధాన క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్ – తెలుగుగా నిలవగా, సిద్ధ్ శ్రీరామ్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ – తెలుగు అవార్డు గెలిచారు.

55
100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విజయ్–రష్మికల గీత గోవిందం

₹5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన గీత గోవిందం సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹132 కోట్లు వసూలు చేసి, 2018లో నాలుగో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. భరత్ అనే నేను, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ తర్వాతి స్థానంలో ఉంది.

బన్నీ వాస్ ఈ సినిమాను GA2 Pictures పతాకంపై నిర్మించగా, గీతా ఆర్ట్స్ ద్వారా విడుదలైంది. గీతా కనుగంటి, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, నాగేంద్రబాబు, సుహాసిని మణిరత్నం, అన్నపూర్ణ, గిరిబాబు తదితరులు నటించారు.

ఏడేళ్లైనప్పటికీ, ఈ సినిమా పరశురామ్ అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. విజయ్–రష్మికల జోడీ, గోపీ సుందర్ సంగీతం, పరశురామ్ కథనశైలి ఇవన్నీ గీత గోవిందంను ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రంగా మార్చాయి. ఇప్పుడు విజయ్–రష్మిక జోడీ వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి కూడా ఈ చిత్రం కూడా ఓ కారణంగా ఉందని చెప్పవచ్చు. అక్కడి నుంచే వీరి పరిచయం మొదలైంది మరి !

Read more Photos on
click me!

Recommended Stories