Its Confirmed: విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్.. రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ కపుల్ గా జర్నీ

Published : Oct 04, 2025, 12:01 AM IST

లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు నిశ్చితార్థం చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకుని తమ రిలేషన్ ని అఫీషియల్ చేసుకున్నారు. ఇది ఏసియా నెట్ ఎక్స్ క్లూజివ్ గా అందిస్తున్న సమాచారం. 

PREV
13
విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం 

లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు నిశ్చితార్థం చేసుకున్నారు. శుక్రవారం రోజు అంటే అక్టోబర్ 3న మధ్యాహ్నం రష్మిక, విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ జరిగింది. దీనితో విజయ్ దేవరకొండ, రష్మిక కొత్త జర్నీకి తొలి అడుగు పడినట్లు అయింది. విజయ్ దేవరకొండ, రష్మిక చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఎంగేజ్మెంట్ చేసుకుని తమ రిలేషన్ ని అఫీషియల్ చేసుకున్నారు. ఇది ఏసియా నెట్ ఎక్స్ క్లూజివ్ గా అందిస్తున్న సమాచారం. 

23
మూడు నెలల్లో పెళ్లి 

విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ విషయాన్ని పీఆర్ టీం కూడా అధికారికంగా ధ్రువీకరించారు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే విజయ్, రష్మిక నిశ్చితార్థంలో పాల్గొన్నారు. మూడు నెలల్లో వీరిద్దరి వివాహం జరగనుంది.విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరో. చివరగా కింగ్డమ్ చిత్రంలో నటించాడు. కింగ్డమ్ మూవీ పర్వాలేదనిపించింది. 

33
రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ వరకు 

మరోవైపు రష్మిక మందన్న పుష్ప 2, ఛావా, యానిమల్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ లో ఒక్కటయ్యే వరకు వీరి జర్నీ ఆసక్తికరంగా సాగింది. 

Read more Photos on
click me!

Recommended Stories