600 కోట్లు కొల్లగొట్టిన సౌత్ ఇండియన్ సినిమాలు ఇవే.. లిస్ట్ లో కల్కి చేరిందా మరి..?

First Published Jul 3, 2024, 5:50 PM IST

 సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపేస్తున్నాయి. బాలీవుడ్ ను తలతన్నే సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. ఈక్రమంలో 600 కోట్ల కలెక్షన్ మార్క్ ను దాటిన సినిమాలు ఏమున్నాయో చూద్దాం., 
 

తాజాగా కల్కి సినిమా 600 కోట్ల కలెక్షన్ మార్క్ ను క్రాస్ చేసింది.  5 రోజుల్లోనే ఈ సినిమా ఈ మార్క్ ను అందుకోవడం విశేషం.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా  ఈ కలెక్షన్స్ ను అందుకోవడం విశేషం. ఇక కల్కి సినిమా ఇండియాలో ఐదు రోజుల్లో 343 కోట్లు వసూలు చేసింది.

రవితేజ ప్రేమ కోసం సూసైడ్ చేసుకోబోయిన టాలీవుడ్ హీరోయిన్..? నిజమెంత..?

కల్కి సినిమాకు సౌత్ కంటే కూడా నార్త్ లో మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. సౌత్ నుంచి  తెలుగు వర్షన్ భారీగా కలెక్ట్ చేస్తుండగా.. అటు  హిందీ వెర్షన్ నుంచి కూడా  భారీ విజయంతో పాటు వసూల్లు సాధిస్తున్నట్టు సమాచారం. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే నటించిన కల్కి చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ ఇంట్లో పెత్తనం అంతా ఆమెదేనా..? పవర్ స్టార్ ను కంట్రోల్ చేసే పవర్ ఫుల్ లేడీ ఎవరు ..?

Latest Videos


సౌత్ ఇండియాలో రూ.600 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమాల జాబితాలో రాజమౌళి డైరెక్ట్ చేసి.. ప్రభాస్ నటించిన  బాహుబలి, బాహుబలి 2  సినిమాలు మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ సినిమాల రికార్డ్ ను అందుకోవడం ఎవరికీ సాధ్యం కావడంలేదు. 

దీపిక పదుకొనే ప్రెగ్నెన్సీ పై అనుమానాలు,ఫేక్ బేబీ బంప్ తో తిరుగుతుందా.? సరోగసీ ద్వారా కనబోతున్నారా..? నిజమేంత

ఇక ఆతరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ కూడా 600 కోట్ల క్రాస్ చేసిన సినిమాగా రికార్డ్ కెక్కింది. కీరవాణి సంగీతం అందించిన ఈమూవీ దేశానికే గర్వకారణంగా నిలిచింది. రెండు ఆస్కార్ లు సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. 

ఇక అంతకు ముందు తమిళ తలైవా రజినీకాంత్ నటించి.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన రోబో  2.0 సినిమా కూడా 600 కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన సినిమాగా బాక్సాఫీస్ రికార్డ్స్ లో చేరింది.

ఇక  కన్నడ నాట నుంచి కూడా ఓ సినిమా ఈలిస్ట్ లో చేరింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్  హీరోగా వచ్చిన  KGF సెకండ్ పార్ట్ మూవీ ఈ ఘనతను అందుకుంది. ఇటు తమిళ సినిమా నుంచి మరోసారి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన  జైలర్ మూవీ కూడా 600 కోట్లు కలెక్షన్ ను దాటింది. నెల్సన్ దిలీప్ డైరెక్షన్ లో.. అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈసినిమా సౌత్ స్క్రీన్ ను దుమ్మురేపింది. 

Salaar

ఇక ఈ 600 కోట్ల క్లబ్ లో నాలుగు సార్లు ప్రభాస్ కు ప్లేస్ దక్కింది. ఈ జాబితాలో ప్రభాస్ నాలుగు సినిమాలు నిలవడం విశేషం. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కి.. ప్రభాస్ నటించిన సలార్ మూవీ కూడా 600 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ మూవీలో శృతీ హాసన్ తో పాటు దిశా పటానీ కూడా సందడి చేసింది. 
 

సౌత్ ఇండియ నుంచి ఈ సినిమాలు  600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేశాయి. ఈ జాబితాలో  ప్రభాస్ 4 సినిమాలు, రజనీకాంత్ 2 సినిమాలతో పాటు.. ఆర్ ఆర్ ఆర్ , కెజియఫ్  సినిమాలు కూడా నిలిచాయి. 
 

click me!