శిరీష్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూతురుని చూడాలనిపిస్తుందని అడిగాడట. దీంతో పాపని పంపించమని శ్రీజ, మెగా ఫ్యామిలీని అడిగారట. తెలిసిన వాళ్ల ద్వారా అడిగిపించామని, కానీ వాళ్లు పంపించలేదని తెలిపింది శిరీష్ తల్లి. దీంతో కొడుకు ఎంతో బాధపడ్డాడని చెప్పింది. ఏ తండ్రి అయినా కూతురుని దూరం చేసుకోవాలనుకోడని చెప్పింది. నివృతి మా వంశం, మా పాప, నా మొదటి మనవరాలు, ఆమెని చూడాలని నాకూ ఉంటుంది. కానీ పంపించడం లేదని, పెద్ద వాళ్లు కదా అని చెప్పింది. ఆమెని కలిస్తే, పాపతో మాట్లాడాల్సి వస్తే ఏం చెబుతారని అడగ్గా, మీ నాన్నగారు ఇది, నేను నానమ్మని, ఇది మన ఫ్యామిలీ` అని చెబుతా అని తెలిపింది శిరీష్ తల్లి.