`పుష్ప 2ః ది రూల్‌` సినిమాలో 5 హైలైట్స్.. థియేటర్లలో పూనకాలు తెప్పించే ఎలిమెంట్లు ఇవే

Published : Dec 05, 2024, 12:37 PM IST

`పుష్ప 2` సినిమా థియేటర్లలో రచ్చ చేస్తుంది. పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంటుంది. మరి ఆడియెన్స్ కి పూనకాలు తెప్పించేలా ఇందులో ఏమున్నాయి? ప్రధానంగా ఐదు హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం.   

PREV
17
`పుష్ప 2ః ది రూల్‌` సినిమాలో 5 హైలైట్స్.. థియేటర్లలో పూనకాలు తెప్పించే ఎలిమెంట్లు ఇవే

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప 2ః ది రూల్‌` మూవీ థియేటర్లలో రచ్చ చేస్తుంది. బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్స్ తో పుష్ప హంగామా స్టార్ట్ అయ్యింది. ప్రీమియర్స్ తో స్టార్ట్ అయిన సందడి ఇప్పుడు థియేటర్లలో కంటిన్యూ అవుతుంది. ఫ్యాన్స్ ని, మాస్‌ ఆడియెన్స్ కి బాగా ఆకట్టుకునేలా ఉంది. బన్నీ ఫ్యాన్స్ అయితే ఊగిపోవడం పక్కా, అదే సమయంలో బీ, సీ సెంటర్ల ఆడియెన్స్ కి బాగా ఎక్కుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం సినిమాకి అన్ని చోట్ల నుంచి పాజిటివ్‌ రియాక్షన్‌ వస్తుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

27

సినిమాలో కథ పరంగా, లాజిక్‌ల విషయంలో కొంత నెగటివ్‌ ఉన్నా, అల్లు అర్జున్‌ విశ్వరూపం ముందు, భారీ యాక్షన్‌ సీన్ల ముందు, ఎలివేషన్ల ముందు, సుకుమార్‌ టేకింగ్‌ ముందు, దేవిశ్రీ ప్రసాద్‌ పాటల ముందు అవి తేలిపోయాయని చెప్పొచ్చు. దీంతో `పుష్ప 2` ప్రపంచ వ్యాప్తంగా భారీగానే వసూళ్లని రాబట్టే అవకాశం ఉంది. తొలి రోజు బెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు నటనలో అల్లు అర్జున్‌కి మరోసారి జాతీయ అవార్డులు పక్కా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

37
Pushpa 2 twitter review

ఇదిలా ఉంటే `పుష్ప 2` సినిమా ఈ రేంజ్‌లో ఆదరణ పొందడానికి కారణం ఏంటి? పాజిటివిటీకి కారణమేంటి? ప్రధానంగా 5 హైలైట్స్ గురించి తెలుసుకుందాం. మొదటిదిః సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యాక్షన్‌ సీన్లు. సినిమా మొత్తానికి అదే హైలైట్స్. ఒకదాన్ని మించి మరోటి డిజైన్‌ చేసుకున్నారు దర్శకుడు సుకుమార్‌, హీరో అల్లు అర్జున్‌. యాక్షన్‌ కొరియోగ్రఫీ వేరే లెవల్‌లో ఉంది.

ముఖ్యంగా జాతర ఎపిసోడ్‌, క్లైమాక్స్ ఫైట్ పీక్‌లో ఉన్నాయని చెప్పొచ్చు. ఆ సమయంలో గూస్‌బంమ్స్ పక్కా. సినిమాలో మొత్తం ఐదు మెయిన్‌ ఫైట్స్ ఉంటే సెకండాఫ్‌లో వచ్చే ఫైట్స్ వేరే స్థాయిలో ఉన్నాయి. అందుకే సెకండాఫ్‌ బాగా వర్కౌట్‌ అయ్యింది. 
 

47
PUSHPA 2 REVIEW

రెండోదిః అల్లు అర్జున్‌ ఎలివేషన్లు, ట్విస్ట్ లు. ఇప్పుడు మాస్‌, యాక్షన్‌ సినిమాల్లో ఎలివేషన్లే ప్రధానం. ఇందులో ఆ ఎలివేషన్లకి కొదవ లేదు. ప్రారంభంలో అల్లు అర్జున్‌ ఎంట్రీ సీన్‌, పోలీస్‌ స్టేషన్‌లో పుష్ప ఇచ్చిన ఝలక్‌, సీఎంని మార్చేందుకు రావు రమేష్‌తో చెప్పే సీన్లు,

ఇంటర్నేషనల్‌ డీలర్‌తో మాట్లాడే సీన్‌, ఇంటర్వెల్‌లో ఎస్పీ షేకావత్‌తో సవాల్‌ చేసే సీన్‌ హై ఇచ్చే సీన్లు. సరుకుని తరలించేందుకు షేకావత్‌కి పుష్ప ఇచ్చిన ట్విస్ట్ లు, శ్రీలంక బార్డర్‌ దాటించే సీన్లు హైలైట్‌గా నిలుస్తాయి. ఎలివేషన్లతోపాటు ట్విస్ట్ లు సినిమాకి మరో హైలైట్‌గా చెప్పొచ్చు. 

57
Pushpa 2 twitter review

మూడోదిః పాటలు సినిమాలో మరో హైలైట్‌. ముందుగా వచ్చిన ఆడియో పెద్దగా ఎక్కలేదు. వ్యూస్‌ వచ్చినా ఏదో అసంతృప్తిగా ఉండేది. కానీ థియేటర్లలో మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. విజువల్స్ పరంగా అలరించాయి. డాన్సుల్లోనూ బన్నీ మరోసారి రెచ్చిపోయారు. ఫీలింగ్స్ పాటలో రష్మిక కూడా వేరే లెవల్‌లో డాన్సు చేసింది.

బన్నీకి పోటీ ఇచ్చింది. శ్రీలీలతో వచ్చే `కిస్సిక్‌` పాటకి పెద్ద కథే ఉంటుంది. ఆ పాట కూడా మాస్‌ ఆడియెన్స్ చేత డాన్సు చేయించేలా ఉంటుంది. మ్యూజిక్‌, బీజీఎం సినిమాకి మరో అసెట్‌గా నిలిచింది. ఇందులో దేవిశ్రీప్రసాద్‌తోపాటు థమన్‌, సామ్‌ సీఎస్‌ తమ బెస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. 
 

67
Pushpa 2 twitter review

నాల్గోదిః అల్లు అర్జున్‌ నటన హైలైట్‌ ఆయన పాత్రని డిజైన్‌ చేసిన తీరు, అందులో ఆయన నటన వేరే స్థాయిలో ఉంది. రెచ్చిపోయి యాక్ట్ చేశాడు బన్నీ. ఇంకా చెప్పాలంటే తన ప్రాణం పెట్టాడు. ఇదే నా జీవితం అనే స్థాయిలో ఆయన యాక్ట్ చేశాడు.

మాస్‌ లుక్‌లో కనిపించడమే కాదు, యాక్టింగ్‌తోనూ మెస్మరైజ్‌ చేశాడు. యాక్షన్‌ సీన్లలో మాత్రం తాండవం ఆడాడు. అమ్మోరు పూనితే ఎలా ఉంటుందో అలా చేశాడు బన్నీ. సినిమాని అవలీలగా మోసేశాడు. ఎక్కడికో తీసుకెళ్లాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అల్లు అర్జున్‌ విశ్వరూపం. 

77

ఐదోదిః ఫైనల్‌గా ఫ్యామిలీ సెంటిమెంట్‌ మరో హైలైట్‌గా చెప్పాలి. ఆడబిడ్డ పుట్టాలని బన్నీ చేసే డాన్స్, ఈ క్రమంలో రష్మికతో వచ్చే సీన్లు కన్నీళ్లు పెట్టిస్తారు. అదే సమయంలో అజయ్‌కి రష్మిక ఎదురు తిరిగే సీన్లు అదే రేంజ్‌లో ఎమోషనల్‌గా అనిపిస్తాయి. పుష్పని అవమానించిన సీన్లు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ సీన్‌ కూడా పిండేసేలా ఉంటుంది.

 సాధారణంగా క్లైమాక్స్ లో విలన్‌ని అంతం చేసి కథ సుఖాంతం అవుతుంది. కానీ ఇందులో ప్రీ క్లైమాక్స్ లోనే ఫైట్‌ పెట్టి, ఆ తర్వాత ఫ్యామిలీ సెంటిమెంట్‌తో క్లైమాక్స్ ముగింపు పలికాడు. ఈ సమయంలో బన్నీ ఎమోషనల్‌ అయిన తీరు కూడా గుండెని బరువెక్కిస్తుంది. 

read more: `పుష్ప 2` మూవీ రివ్యూ, రేటింగ్‌

also read: పుష్ప 2 ఫస్ట్ డే ఫస్ట్ షో : లైవ్ అప్డేట్స్
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories