డిసెంబర్ 12 న వివాహం జరగబోతోంది. 10 వ తేదీన హల్దీ వేడుకతో పెళ్లి సంబరాలు మొదలవుతాయి. కీర్తి సురేష్ పెళ్లి తర్వాత సినిమాలు కొనసాగిస్తుందా లేదా అనేది ఇప్పుడే తెలియదు. కీర్తి సురేష్.. మేనకా సురేష్, సురేష్ కుమార్ దంపతుల సంతానం. మేనకా సురేష్ అప్పట్లో నటిగా రాణించారు. మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం పున్నమినాగులో హీరోయిన్ గా నటించింది మేనకనే.