అనుకున్నట్లుగానే ‘పుష్ప 2’ప్రభంజనం సృష్టిస్తోంది! వాస్తవానికి ‘పుష్ప’ టైమ్ లో ఇంత బజ్, క్రేజ్ లేదు. మొదటి రోజు తెలుగులో డివైడ్ టాక్ నడిచింది.అయితే ఊహించని విధంగా నార్త్ లో ‘పుష్ప’సెన్సేషన్ క్రియేట్ చేసింది.
అక్కడి మాస్ కు ఈ సినిమా పిచ్చ పిచ్చగా ఎక్కేసింది. దాంతో ‘పుష్ప 2’పై అంచనాలు పెరిగాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసారు. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. గంగమ్మ జాతర ఎపిసోడ్ కు అయితే మరీను. కానీ గంగమ్మ జాతర ఎపిసోడ్ ని ఓ చోట ట్రిమ్ చేసి వదలాల్సి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
మన దేశంలో ‘పుష్ప 2’ రమ్ టైమ్ వ్యవధి దాదాపు 3. 20 నిమిషాలు ఉంది, అయితే సౌదీ అరేబియాలో రన్ టైం ను తగ్గించారని తెలుస్తోంది. సౌదీ అరేబియా సెన్సార్ బోర్డు జాతర ఎపిసోడ్‌ను ట్రిమ్ చేసిందని తెలుస్తోంది.
అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రాన్ని సౌదీ అరేబియా సెన్సార్ బోర్డు 19 నిమిషాలు కట్ చేసింది. ఇప్పుడు 3 గంటల 1 నిమిషం నిడివిగల ఈ చిత్రం సౌదీ అరేబియాలో విడుదలైంది. ‘పుష్ప 2’లో కొన్ని కట్స్ తర్వాత అక్కడ విడుదలకు అనుమతించారు.
సౌదీ అరేబియా సెన్సార్ బోర్డు చాలా బాలీవుడ్ సినిమాలను ట్రిమ్ చేసింది, అలాగే నచ్చకపోతే బ్యాన్ చేసింది. అయితే తాజాగా పుష్ప 2 విషయానికి వచ్చేసరికి జాతర ఎపిసోడ్ లో హీరో గెటప్ (అమ్మవారి గెటప్ లో చీరకట్టుకున్న హీరో)ని అక్కడ సెన్సార్ బోర్డ్ అనుమతించలేదు.
అలాగే హిందూ దేవతల పేర్లను రిఫరెన్స్ తేవటం కూడా సెన్సార్ చేసారని తెలుస్తోంది. మల్టిపుల్ కట్స్ తో 19 నిముషాల లెంగ్త్ ని తగ్గించి అక్కడ సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు.
Allu Arjun, #Pushpa2, sukumar
పుష్ప 2 సెకండాఫ్ ని నిలబెట్టే ఎపిసోడ్ ‘జాతర’. జాతర ఎపిసోడ్ గురించి రిలీజ్ ముందు నుంచీ చాలా చర్చ నడిచింది. సినిమాలో ఈ సీన్ దాదాపు20 నిమిషాలు మాత్రమే ఉన్నా అందుకోసం బాగా ఖర్చు పెట్టారని తెలిసింది.
అంత పెద్ద ఎపిసోడ్ ఎంతబాగా ఎంగేజ్ చేస్తుందంటే.... ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు ముగిసిందో తెలీనంతలా ఉంటుంది. జాతర పాటలో బన్నీ విశ్వరూపం చూపించాడు అని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆ ఎపిసోడ్ చూడటానికి అయినా జనం థియేటర్స్ దగ్గర క్యూలు కడతారనటంలో సందేహం లేదు.
సుకుమార్ చాలా టైమ్ తీసుకొని చేసిన ప్రాజెక్ట్ ఇది. దాదాపు మూడేళ్లు కష్టపడ్డాడు. ఆ కష్టం తెరపై కనిపిస్తోంది. అల్లు అర్జున్ కూడా వేరే సినిమా ఒప్పుకోకుండా కేవలం ‘పుష్ప’ కోసమే టైమ్ కేటాయించాడు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకపోవటం కూడా కలిసి వచ్చింది.
దానికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ అంకెలు షాక్ ఇస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పెద్ద డిస్టిబ్యూటర్లు ఈ సినిమా కోసం పోటీ పడ్డారు. ప్రీమియర్ షోలకూ, టికెట్ రేట్లు పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చేశాయి. ఇవన్నీ ఈ సినిమాకు కలిసి వచ్చాయి.