ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఇలాంటి వింత జరిగి ఉండదు. ఎన్నడూ చూడని రీతిలో, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో, క్వాలిటీ గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ లో తెరకెక్కిన సినిమా మహావతార్ నరసింహ. ఈ సినిమా కేవలం ఒక పౌరాణిక కథ మాత్రమే కాదు, అంతకు మించిన అసాధారణమైన గ్రాఫిక్స్ మాయాజాలం. మహావతార్ నరసింహ అద్భుతమైన స్టోరీ, స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇంత గ్రాండియర్ లుక్ తో కనిపించిన ఈమూవీ సుమారుగా 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైనట్లు సమాచారం. అయితే, ఈ తక్కువ బడ్జెట్‌తోనే ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అసాధారణం. విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 300 కోట్ల మార్కును దాటి, కలెక్షన్లలో సరికొత్త రికార్డులను సృష్టించింది.