23 ఏళ్లకే 250 కోట్ల ఆస్తులు, స్టార్ హీరోయిన్లకే షాక్ ఇచ్చిన యంగ్ బ్యూటీ ఎవరో తెలుసా?
23 ఏళ్ల చిన్న వయస్సులోనే 250 కోట్ల వరకూ ఆస్తులను సంపాదించింది ఓ హీరోయిన్. స్టార్ హీరోయిన్లకు కూడా సాధ్యం కాని పనిని చేసి చూపించింది. ఇంతకీ ఎవరా బ్యూటీ.
23 ఏళ్ల చిన్న వయస్సులోనే 250 కోట్ల వరకూ ఆస్తులను సంపాదించింది ఓ హీరోయిన్. స్టార్ హీరోయిన్లకు కూడా సాధ్యం కాని పనిని చేసి చూపించింది. ఇంతకీ ఎవరా బ్యూటీ.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్నా కాని.. ఆవగింజఅంత అదృష్టం కూడా ఉండాలి అంటాడు సీనియర్ నటుడు కొటా శ్రీనివాసరావు. అది లేకుంటే ఇండస్ట్రీలో ఎదగడం కష్టం అని చెప్పవచ్చు. ఒక వేళ ఇండస్ట్రీకి వచ్చినా స్టార్ అవ్వలేరు. అయినాకోట్లు సంపాదించలేరు.. సంపాదించినా చివరి వరకూ నిలుపుకోలేరు. కాని కొంత మంది మాత్రం నక్క తోక తొక్కి ఇండస్ట్రీకి వస్తారు. వారికి చిన్న వయస్సులోనే అదృష్టం వరిస్తుంది. అలాంటి హీరోయిన్ ఎవరో తెలుసా?
Also Read: చిరంజీవి ముద్దు పేరుతో పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా? మెగాస్టార్ తో చనువున్న ఏకైక నటి?
చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన జన్నత్.. 2001 ఆగస్టు 29న ముంబైలో జన్మించింది. 2008లో చాంద్ కే పర్ చలో సీరియల్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది. వరుసగా షోస్, సీరియల్స్ లో ఆమెకు అవకాశం వచ్చింది. దాంతో బుల్లితెర స్టార్ గా మారింది జన్నత్ జుబేరా. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ వస్తున్న ఈబ్యూటీ.. చేతినిండా సంపాదన కూడా ఉండటంతో.. ఫ్యాన్ పాలోయింగ్ తో పాటు ఆస్తులు కూడా భారీగా కూడబెట్టింది. అంతే కాదు స్టార్స్ ను కూడా వెనక్కు నెట్టింది.
Also Read: రజినీకాంత్ ను ప్రేమించి, నిర్మాతను రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఈ ముద్దు గుమ్మ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి వెంటనే అందం, అభినయంతో కట్టిపడేసింది. తన టాలెంట్ తో దేశ వ్యాప్తంగా మంచి పేరును తెచ్చుకుంది. 23 ఏళ్ల వయసుకే రూ. 250 కోట్ల ఆస్తులు సంపాదించింది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ జన్నత్ జుబేర్ రహ్మానీ. చాలా చిన్న వయస్సులో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జన్నత్ జుబేర్.. తక్కువ టైమ్ లోనే మంచి క్రేజ్ ను సాధించింది.
Also Read: 5 కోట్లు ఖర్చు చేసి 5 సెకండ్ల సీన్ తీసిన దర్శకుడు? సినిమా హిట్టా ఫట్టా?
ముఖ్యంగా ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఎంతలా ఉంది అంటే.. షారుఖ్ ఖాన్ కంటే కూడా జన్నత్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. షారుఖ్ ఖాన్ కు ఇన్ స్టాలో 46 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే.. జన్నత్ జుబైర్ కు ఇన్ స్టాలో 49.7 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు.
Also Read: 1000 రోజులు థియేటర్ లో ఆడిన మాస్ హీరో సినిమా ఏంటో తెలుసా?
బుల్లితెరపై భారీ రెమ్యునరేషన్ తీసుకునే తారగా జన్నత్ నిలిచింది. బాలీవుడ్ లో ఎక్కువగా రియాల్టీ షోలలో పార్టిస్పేట్ చేసిన ఈబ్యూటీ.. ఖత్రోన్ కే ఖిలాడీ షోలో ఒక్క ఎపిసోడ్ కోసం 18 లక్షల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంది. మరో షో కోసం ఒక్కో ఎపిసోడ్ కు రూ.2 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇంత చిన్న వయస్సులో భారీగా ఆస్తులు సంపాదించిన జన్నత్.. 21 ఏళ్ల వయసులోనే ముంబైలో సొంతంగా కొనేసింది. అంతే కాదు తన సినిమా సంపాదనతో బయట వ్యాపారల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు, మరికొన్నిసొంత వ్యాపారాలు కూడా చేస్తోందట. ఇలా చాలా చిన్న వయస్సులోనే భారీగా ఆస్తులు సాధించిన బుల్లితెర తారగా ఆమె నిలిచింది.