బిగ్‌ బాస్‌ తెలుగు 9 పదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌, ఈ ఇద్దరు క్రేజీ కంటెస్టెంట్లు ఔట్‌

Published : Nov 15, 2025, 02:43 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 పదో వారం నామినేషన్‌లో పది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో క్రేజీ కంటెస్టెంట్‌ హౌజ్‌ని వీడబోతున్నాడట. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌కి ఛాన్స్ ఉందంటున్నారు. 

PREV
14
బిగ్‌ బాస్‌ 9 తెలుగు 10వ వారం ఎలిమినేషన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9 పదో వారం ఎలిమినేషన్‌కి సంబంధించి ఆసక్తికర వార్తలు బయటకు వచ్చాయి. ఈ వారం నామినేషన్‌ నుంచి శుక్రవారం ఎపిసోడ్‌లో తనూజ సేవ్‌ అయ్యింది. కెప్టెన్సీ టాస్క్ లో ఆమె ఇమ్యూనిటీ పొంది కెప్టెన్‌ అయ్యింది. దీంతో నామినేషన్‌ నుంచి సేఫ్‌ అయ్యింది. ఇక ఈ వారం తనూజ, ఇమ్మాన్యుయెల్‌ తప్పించి మిగిలిన వారంతా నామినేషన్‌లో ఉన్నారు. కళ్యాణ్‌, డీమాన్‌ పవన్‌, సుమన్‌ శెట్టి, భరణి, గౌరవ్‌ గుప్తా, నిఖిల్‌ నాయర్‌, సంజనా, రీతూ చౌదరీ, దివ్య నామినేషన్‌లో ఉంటారు. వీరిలో ఈ వారం హౌజ్‌ని ఎవరు వీడబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.

24
నిఖిల్‌ నాయర్‌ ఎలిమినేట్‌

అయితే దీనికి సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చింది. ఈ వారం ఓటింగ్‌ ప్రకారం నిఖిల్‌ నాయర్‌, గౌరవ్‌ గుప్తా, దివ్య బాటమ్‌లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉందని తెలిసింది. తాజాగా ఎలిమినేషన్‌కి సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చింది. ఈ వారం హౌజ్‌ని వీడేది నిఖిల్‌ నాయర్‌ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఎలిమినేషన్‌కి సంబంధించిన షూటింగ్‌ జరుగుతుందట. అయితే చాలా వరకు దివ్య ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉందని అన్నారు. చాలా మంది ఆమె ఎలిమినేట్‌ కావాలని కోరుకున్నారు. కానీ హౌజ్‌లో మాత్రం ఆమె చాలా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్ గా ఉన్నారు. దీంతో బిగ్‌ బాస్‌ దివ్యని సేవ్‌ చేసి నిఖిల్‌ని ఎలిమినేట్‌ చేసినట్టు సమాచారం.

34
కంటెంట్‌ ఇవ్వడంలో ఫెయిల్ అయిన నిఖిల్‌

అయితే నిఖిల్‌ నాయర్‌, గౌరవ్‌ గుప్తా ఓటింగ్‌ పరంగా చాలా లీస్ట్ లో ఉన్నారు. అంతేకాదు ఆటల్లోనూ లీస్ట్ లో ఉన్నారు. ఏమాత్రం ఎంటర్‌టైన్‌చేయలేకపోతున్నారు. తెలుగులో సరిగా మాట్లాడలేకపోతున్నారు. కంటెంట్‌ ఇవ్వడంలో ఫెయిల్‌ అవుతున్నారు. హౌజ్‌లో సైలెంట్‌గానే ఉంటున్నారు. గట్టిగా గొడవలకు కూడా దిగడం లేదు. దీంతో మొదటి నుంచి వీరికి ఆడియెన్స్ నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. వీళ్లు హౌజ్‌లో ఉన్నారా? లేరా అన్నట్టుగానే ఉంటున్నారని నాగార్జున కూడా హెచ్చరించారు. అందరితో మాట్లాడాలని, యాక్టివ్‌గా ఉండాలని, బాగా గేమ్స్ ఆడాలని తెలిపారు. కానీ ఏమాత్రం రిజల్ట్ కనిపించడం లేదు. అడపాదడపా గౌరవ్‌ గుప్తా కెమెరా ముందుకు వచ్చి ఇతర హౌజ్‌మేట్ల గురించి ఏదో కంప్లెయింట్‌ ఇస్తూనే ఉన్నాడు. కానీ నిఖిల్‌ అది కూడా చేయడం లేదు. దీంతో ఆడియెన్స్ ఓటింగ్‌ తో దెబ్బకొట్టారు. ఆయన్ని ఈ సారి హౌజ్‌ నుంచి పంపిస్తున్నారు.

44
ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌.. గౌరవ్ కూడా ఔట్‌?

ఇదిలా ఉంటే ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉండబోతుందని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం హౌజ్‌లో 11 మంది ఉన్నారు. ఈ వారం ఒకరు ఎలిమినేట్‌ అయితే 10 మంది ఉంటారు. టాప్‌ 5కి చేరడానికి ఐదుగురికే ఛాన్స్ ఉంది. కానీ నాలుగు వారాలే ఉంది. ఐదో వారం టాప్‌ 5 కంటెస్టెంట్లు ఉంటారు. దీంతో ఒక వారం డబుల్ ఎలిమినేషన్‌ ఉంటుందని, మరో ఎలిమినేషన్‌ గౌరవ్‌ అని సమాచారం. ఇలా ఈ వారం ఈ ఇద్దరిని హౌజ్‌ నుంచి పంపించబోతున్నట్టు  తెలుస్తోంది. దీనికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories