కాంత కలెక్షన్ల వర్షం కురిపించిందా? దుల్కర్ సల్మాన్ మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ రిపోర్ట్

Published : Nov 15, 2025, 10:38 AM IST

Kaantha Opening Day Collection :  రానా దగ్గుబాటి,  దుల్కర్ సల్మాన్ నటించిన  సినిమా ‘కాంత’. ఈ సినిమాకు  మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో, కాంతా మూవీ  బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసింది. ?

PREV
14
కాంత మొదటి రోజు కలెక్షన్లు

'లక్కీ భాస్కర్' తర్వాత దుల్కర్ హీరోగా నటించిన సినిమా 'కాంత'. ఈ ఏడాది అతను లీడ్ రోల్‌లో నటించిన మొదటి సినిమా ఇది. రిలీజ్‌కు ముందు జరిగిన ప్రీమియర్ షోలో ఈ సినిమాకు, దుల్కర్ నటనకు మంచి స్పందన వచ్చింది. ఈమూవీలో రానా దగ్గుబాటి పాత్రకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. 

24
ఇండియాలో కాంత కలెక్షన్స్

నిన్న రిలీజ్ అయ్యాక కూడా సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ కొనసాగింది. అయితే, ఈ పాజిటివ్ రివ్యూలు బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు ప్రభావం చూపాయి? ఇప్పుడు సినిమా మొదటి రోజు కలెక్షన్ల వివరాలు బయటకొచ్చాయి. ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకర్ సాక్నిల్క్ ప్రకారం, ఈ సినిమా మొదటి రోజు ఇండియాలో రూ.4 కోట్లు వసూలు చేసింది. ఇవి ప్రాథమిక లెక్కలే, మార్పులు ఉండొచ్చని తెలిపారు.

34
కాంత సినిమాకు ఊహించని స్పందన

అడ్వాన్స్ బుకింగ్స్ కన్నా, రిలీజ్ రోజున 'బుక్ మై షో' లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాకు మంచి స్పందన వచ్చింది. పాజిటివ్ టాక్ రావడంతో, శని, ఆదివారాల్లో కలెక్షన్లు ఎలా ఉంటాయోనని ట్రాకర్లు ఎదురుచూస్తున్నారు. 'ది హంట్ ఫర్ వీరప్పన్' నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌తో గుర్తింపు పొందిన సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన  మొదటి సినిమా 'కాంత'.

44
1950ల నాటి కథతో

1950ల నాటి కథ, నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. ఈమూవీలో  దుల్కర్ ఓ యువ సూపర్ స్టార్‌గా నటించారు. సముద్రఖని దర్శకుడిగా, రానా దగ్గుబాటి పోలీస్ అధికారిగా నటించారు. భాగ్యశ్రీ బోర్సే  హీరోయిన్ గా నటించిన ఈసినిమాను రానాతో కలిసి  దుల్కర్ సల్మాన్  నిర్మించారు.

Read more Photos on
click me!

Recommended Stories