నాని `హిట్ 3` మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, అతి త్వరలోనే.. ఎక్కడ చూడొచ్చంటే?

Published : May 25, 2025, 08:43 PM IST

శైలేష్ కొలను దర్శకత్వంలో నాని, శ్రీనిధి శెట్టి నటించిన `హిట్ 3` చిత్రం ఓటీటీ విడుదలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌ వచ్చింది.   

PREV
14
బాక్సాఫీసు వద్ద దుమ్ములేపిన `హిట్‌ 3`

నాని నటించిన `హిట్ 3` మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. మొదటి వారంలో మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపుర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.

24
నాని వంద కోట్ల సినిమాలు

సూపర్ హిట్ ఫ్రాంఛైజీలో  `హిట్‌`,` హిట్ 2` తర్వాత  వచ్చిన మూడవ చిత్రం `హిట్ 3`. విడుదలైన మొదటి వారాంతంలోనే ఈ చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరి రికార్డు సృష్టించింది. నాని నుంచి వరుసగా వంద కోట్లు సాధించిన మూడవ చిత్రంగా  `హిట్ 3` నిలిచింది. అంతేకాకుండా ఈ ఘనతను అతి తక్కువ సమయంలో సాధించిన నాని చిత్రం కూడా ఇదే. గతంలో నాని నటించిన `దసరా`, `సరిపోదా శనివారం` చిత్రాలు వంద కోట్లు సాధించాయి. 

34
హిట్ 3 ఓటీటీ రిలీజ్

`హిట్‌ 3` మూవీ భారత్‌తో పాటు విదేశాల్లోనూ మంచి వసూళ్లు సాధించింది. విదేశాల్లో 2 మిలియన్ డాలర్లు వసూలు చేసిన నాని మూడో చిత్రం ఇది కావడం విశేషం. ఈ చిత్రం మొదటి వారంలోనే బ్రేక్‌ ఈవెన్‌ దాటి లాభాలను కూడా అర్జించింది. ఈ నేపథ్యంలో `హిట్ 3` చిత్రం ఓటీటీ రిలీజ్ గురించి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం మే 29న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల కానుంది.

44
`హిట్ 3` చిత్ర బృందం

`హిట్ 3` చిత్రానికి సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహణం అందించారు. మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. అదేవిధంగా ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.  ప్రొడక్షన్ డిజైనర్‌గా నాగేంద్ర తంగల్, కథా రచయితగా శైలేష్ కొలను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎస్. వెంకట్రత్నం (వెంకట్), సౌండ్ మిక్సింగ్: సురన్ జి, అసోసియేట్ డైరెక్టర్‌గా వెంకట్ మత్తిరాల వంటి భారీ సాంకేతిక బృందం ఈ మూవీకి పనిచేసింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories