70 ఏళ్ల హీరోతో 40 ఏళ్ల త్రిష ఆన్ స్క్రీన్ రొమాన్స్‌ పై విమర్శలు, క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Published : May 23, 2025, 01:32 PM IST

థగ్ లైఫ్ సినిమాలో కమల్ హాసన్‌తో త్రిష రొమాంటిక్ సీన్స్ లో నటించడం  వివాదాస్పదమయ్యింది. ఈ నేపథ్యంలో,  త్రిష ఈ విషయంలో స్పందించారు. ఫ్యాన్స్ కు వివరణ కూడా ఇచ్చారు. 

PREV
14
Trisha Says About Romancing Kamal Haasan

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, మణిరత్నం థగ్ లైఫ్ సినిమా గురించి సినీ వర్గాల్లో చర్చ జోరందుకుంది. 37 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కలిసి చేస్తున్న ఈ సినిమా జూన్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో త్రిష కీలక పాత్ర పోషించారు. త్రిష, కమల్ హాసన్ మధ్య వయసు తేడా 30 ఏళ్లు. అయినా వాళ్ళు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం చర్చనీయాంశమైంది.

24
విమర్శలకు త్రిష సమాధానం

థగ్ లైఫ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో త్రిష పాల్గొన్నారు. ట్రైలర్‌లో కమల్‌తో రొమాన్స్ సీన్స్, వయసు తేడాపై వస్తున్న విమర్శలకు ఆమె స్పందించారు. ఇలాంటి విమర్శలను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని త్రిష చెప్పారు. కమల్‌తో నటించడం మ్యాజికల్ ఎక్స్ పీరియన్స్  అని ఆమె అన్నారు.

34
థగ్ లైఫ్ గురించి త్రిష ఏమన్నారు?

ఈ సినిమాను  ప్రకటించినప్పుడే ఇలాంటి సన్నివేశాలు ఉంటాయని నాకు తెలుసు. వద్దు అనుకుంటే  అప్పుడే నేను సినిమాలోకి రాకుండా ఉండేదాన్ని. అన్నింటికి రెడీ అయ్యాను కాబట్టే ఈసినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను అని త్రిష అన్నారు.  కమల్, మణిరత్నం కలయిక గురించి త్రిష మాట్లాడింది.  వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తుంటే, మేము నటులమైనా వాళ్ళను చూసి ఆశ్చర్యపోతాం" అని అన్నారు.

44
షుగర్ బేబీ త్రిష

థగ్ లైఫ్‌లోని 'షుగర్ బేబీ' పాటకు త్రిష విమర్శలు ఎదుర్కొంటున్నారు. 40 ఏళ్ల ఈ హీరోయిన్  ఇలాంటి పాటకు డ్యాన్స్ చేయడం కరెక్ట్ కాదు అని  కొందరు  సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. అంతే కాదు , కమల్ హాసన్ తో లిప్ లాక్ లపై కూడా తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. నాయకుడు తర్వాత మణిరత్నం, కమల్ మళ్ళీ కలిసి చేస్తున్న సినిమా కావడంతో థగ్ లైఫ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories