అండర్సన్ కంటే జహీర్ ఖాన్ గొప్ప బౌలర్, ఇంగ్లాండ్‌లో పుట్టి ఉంటేనా.. - ఇషాంత్ శర్మ

Published : Jun 26, 2023, 04:12 PM IST

అప్పుడెప్పుడో 2002లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన జేమ్స్ అండర్సన్, ఇప్పటికీ టెస్టుల్లో కొనసాగుతున్నాడు. యాషెస్ సిరీస్ మొదటి టెస్టులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన జేమ్స్ అండర్సన్, 40 ఏళ్లు దాటినా ఇంకా రిటైర్మెంట్ ఆలోచన లేదని చెప్పేశాడు..

PREV
17
అండర్సన్ కంటే జహీర్ ఖాన్ గొప్ప బౌలర్, ఇంగ్లాండ్‌లో పుట్టి ఉంటేనా..  - ఇషాంత్ శర్మ
Virat Kohli and James Anderson

ఇంగ్లాండ్ తరుపున 179 టెస్టులు ఆడి 685 వికెట్లు తీసిన జేమ్స్ అండర్సన్, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఉన్నాడు...  మరో 23 వికెట్లు తీస్తే, ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్‌ని అధిగమించి టాప్ 2లోకి వెళ్తాడు జేమ్స్ అండర్సన్..

27

‘జిమ్మీ బౌలింగ్ స్టైల్, పద్ధతి చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇంగ్లాండ్‌లోని పిచ్, వాతావరణం పరిస్థితులు అన్నీ అతనికి అనుకూలంగా మారాయి. 

37
Image credit: Getty

అతను ఇండియాలో ఆడితే..  కచ్ఛితంగా ఇంత సక్సెస్ అయ్యేవాడు కాదు... నిజం చెప్పాలంటే జహీర్ ఖాన్, జిమ్మీ అండర్సన్ కంటే చాలా బెటర్ ఫాస్ట్ బౌలర్... ’ అంటూ కామెంట్ చేశాడు ఇషాంత్ శర్మ..

47

2014 విల్లింగ్టన్ టెస్టులో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ మధ్య గొడవ జరిగింది. క్యాచ్ డ్రాప్ చేసిన జహీర్ ఖాన్‌ని ఇషాంత్ శర్మ బూతులు తిట్టడం కెమెరాల్లో కనిపించింది. ఈ సంఘటనపై తాజాగా వివరణ ఇచ్చాడు ఇషాంత్ శర్మ..

57


‘ఆ రోజు నేను, జాక్ (జహీర్ ఖాన్ ముద్దుపేరు)ని తిట్టలేదు. నన్ను నేను తిట్టుకున్నా. నేను ఎవరిని తిట్టా అనేది జనాలకు అర్థం కాలేదు. నేను ఎప్పుడూ కూడా క్యాచ్ వదిలేసిన ఫీల్డర్‌ని తిట్టింది లేదు. అలాంటిది జాక్‌ని ఎందుకు తిడతాను..

67

నిజం చెప్పాలంటే ఆయన నాకు గురూ లాంటోడు. ఎవ్వరినీ ఎలాంటి సందర్భంలోనూ నేను అలా తిట్టను. నా బౌలింగ్‌లో బ్రెండన్ మెక్‌కల్లమ్ భారీగా పరుగులు చేస్తున్నాడు. ఆ ఫ్రస్టేషన్‌తో బయటికి వచ్చిన మాటలవి..

77

ఆ సమయంలోనే నేను, జాక్, మహ్మద్ షమీ మాత్రమే ఫాస్ట్ బౌలర్లం. ప్రతీ నాలుగు ఓవర్లకు ఓ సారి మళ్లీ బౌలింగ్‌కి రావాల్సి వచ్చింది. వికెట్ మాత్రం పడడం లేదు. అది ఫస్ట్రేషన్‌తో అలా నన్ను నేను తిట్టుకున్నాను..’ అంటూ ‘ది రణ్‌వీర్ షో’లో కామెంట్ చేశాడు ఇషాంత్ శర్మ.. 

click me!

Recommended Stories