సూర్యకుమార్ యాదవ్‌ని ఎందుకు సెలక్ట్ చేశారు? సెలక్టర్లపై ఆకాశ్ చోప్రా ఫైర్...

Published : Jun 26, 2023, 03:25 PM IST

వెస్టిండీస్ టూర్‌లో టెస్టు సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టుపై ట్రోలింగ్ ఓ పట్టాన ఆగేలా లేదు. సర్ఫరాజ్ ఖాన్‌ని ఎంపిక చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన క్రికెట్ ఫ్యాన్స్, ఛతేశ్వర్ పూజారాని తప్పించి, విరాట్ కోహ్లీని కొనసాగించడంపై కూడా పెదవి విరిచారు..

PREV
16
సూర్యకుమార్ యాదవ్‌ని ఎందుకు సెలక్ట్ చేశారు? సెలక్టర్లపై ఆకాశ్ చోప్రా ఫైర్...
Suryakumar Yadav

తాజాగా సూర్యకుమార్ యాదవ్‌ని టెస్టులకు ఎంపిక చేయకపోవడానికి కారణాలు చెప్పాలంటూ సెలక్టర్లను ప్రశ్నించాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీకి ముందు శ్రేయాస్ అయ్యర్ గాయంతో బాధపడ్డాడు..

26

దీంతో అతనికి రిప్లేస్‌మెంట్‌గా టెస్టు టీమ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులో ఒకే ఒక్క ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సూర్యకుమార్ యాదవ్, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లో వరుసగా గోల్డెన్ డకౌట్ అయ్యాడు..

36
Image credit: PTI

‘నాకు ఓ విషయం అర్థం కావడం లేదు. ప్లేయర్లను ఏ ప్రాతిపదికగా సెలక్ట్ చేస్తున్నారు? సెలక్ట్ చేసిన తర్వాత వారికి సరైన అవకాశాలు ఇవ్వకుండానే ఎందుకని తప్పిస్తున్నారు.. 
 

46

సూర్యకుమార్ యాదవ్‌ని టెస్టు టీమ్‌కి ఎంపిక చేశారు, అతను ఒక్క టెస్టు కూడా సరిగా ఆడకుండానే మళ్లీ టెస్టుల నుంచి తప్పించారు. అంటే అతన్ని టెస్టులు ఆడించాలనే ఉద్దేశం సెలక్టర్లకు లేదా? మరి ఎందుకు సెలక్ట్ చేశారు..

56

అలాగే అర్ష్‌దీప్ సింగ్‌ని ఎందుకని వన్డేల నుంచి తప్పించారు? అతను ఫిట్‌గా లేడా? ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్‌ని ఎందుకని టీమిండియా తరుపున ఆడే అవకాశం దక్కించుకోడం లేదు..

66
Sarfaraz Khan

టీమ్‌లోకి రావాలంటే అతను ఇంకేం చేయాలో క్లియర్‌గా చెప్పండి.. లేదంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కి ఉన్న కాసింత విలువ కూడా పోతుంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. 

click me!

Recommended Stories