మ్యాచ్ ముగిసిన తర్వాత చాహల్ భావోద్వేగంతో మాట్లాడాడు.. "ఇది ఒక జట్టు విజయం. మేము పాజిటివ్‌గా ఆడాలని నిర్ణయించుకున్నాం. పవర్‌ప్లేలో 2-3 వికెట్లు పడితే మ్యాచ్ మాదేనని అనుకున్నాం. మా బ్యాటింగ్ సమయంలో వాళ్ల స్పిన్నర్లు టర్న్ పొందింది చూసాం, అలాగే మా స్పిన్నర్లకు కూడా పిచ్ సహకరించింది. మొదటి బంతి నుంచే టర్న్ రావడంతో, శ్రేయస్ అయ్యరు 'స్లిప్ కావాలా?' అని ఆడిగాడు. మేము దూకుడుగా ఆడాలనుకున్నాం, ఎందుకంటే ఇది తక్కువ స్కోరింగ్ మ్యాచ్.. గెలవాలంటే వికెట్లు తీసుకోవాల్సిందే" అని చాహల్ అన్నారు.
అలాగే, "గత మ్యాచ్‌లో నేను 56 పరుగులు ఇచ్చాను, కానీ నాపై నాకున్న నమ్మకం తగ్గలేదు. నాకు ఎప్పుడూ ఒకే లక్ష్యం – బ్యాటర్లను ఔట్ చేయాలి. పేస్ వేరియేషన్లు పెడతాను, వాళ్లు సిక్స్ కొట్టాలంటే కష్టపడాల్సిందే" అని చాహల్ అన్నాడు.
"ఇలాంటి గేమ్‌లో గెలవడం వల్ల టీమ్ మోరల్ చాలా పెరుగుతుంది. ఇది పంజాబ్ తరపున నా మొదటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. నా నైపుణ్యాలను విశ్వసిస్తాను, అలా చేస్తే విజయాలు ఖచ్చితంగా వస్తాయి" అని చాహల్ అన్నాడు.