IPL 2025: పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ ఐపీఎల్ నుంచి ఔట్
IPL 2025: పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ లాకీ ఫెర్గూసన్ ఐపీఎల్ 2025 నుంచి అవుట్ అయ్యాడు. ఎందుకు?
IPL 2025: పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ లాకీ ఫెర్గూసన్ ఐపీఎల్ 2025 నుంచి అవుట్ అయ్యాడు. ఎందుకు?
IPL 2025 PBKS: ఐపీఎల్ 2025 క్రికెట్ సంబరం మస్తు మజాను పంచుతూ ఉత్కంఠగా సాగుతోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో బలమైన జట్లలో ఒకటైన పంజాబ్ కింగ్స్ యంగ్, సీనియర్ స్టార్ ప్లేయర్లతో ఫుల్ జోష్ లో ఉంది.
కీలకమైన సమయంలో పంజాబ్ కింగ్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ మొత్తం ఐపీఎల్ సీజన్ నుంచి అవుట్ అయ్యాడు. అతనే ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్. గాయం కారణంగా అతను ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 2 బంతులు మాత్రమే వేసిన లాకీ ఫెర్గూసన్, తొడ కండరాల నొప్పి కారణంగా ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. ఫెర్గూసన్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో 5 వికెట్లు తీసుకున్నాడు.
ఫెర్గూసన్ స్థానంలో ఎవరు వస్తారో తెలియదు. అతని స్థానంలో అస్మతుల్లా ఒమర్జాయ్ జట్టులోకి రావచ్చు. కానీ అతను మీడియం పేసర్. అందుకే ఫెర్గూసన్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ వైశాఖ్ విజయ్ కుమార్ జట్టులోకి రావచ్చు. అతనితో పాటు పంజాబ్ టీమ్ లోకి వచ్చే ప్లేయర్ల లిస్టులో మరికొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు జాకబ్ డఫీ. 2025లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ జాకబ్ డఫీ. పవర్‌ప్లే స్పెషలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ న్యూజిలాండ్ బౌలర్, ఇప్పుడు అన్ని దశల్లో అద్భుతమైన బౌలర్ గా మారాడు. ఇటీవల జరిగిన ఒక ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో 13 వికెట్లు తీసి, న్యూజిలాండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రికార్డును సమం చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు.