టీమ్‌లో ప్లేస్ లేదు... బీచ్‌లో భార్య ధనశ్రీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న యజ్వేంద్ర చాహాల్..

First Published | Oct 29, 2022, 3:29 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడిన భారత జట్టులో స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌కి చోటు దక్కకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. నాలుగేళ్లుగా వైట్ బాల్ క్రికెట్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఉంటూ వస్తున్న యజ్వేంద్ర చాహాల్‌ని కాదని వరుణ్ చక్రవర్తి, రాహుల్‌ చాహార్‌లను ఆడించింది టీమిండియా. టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో చాహాల్‌కి చోటు దక్కింది...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపికైనా ఇప్పటిదాకా జరిగిన తొలి రెండు మ్యాచుల్లో యజ్వేంద్ర చాహాల్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు. అక్షర్ పటేల్, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్‌ వేసి 21 పరుగులు సమర్పించాడు. దీంతో అతని ప్లేస్‌లో చాహాల్‌కి చోటు దక్కొచ్చని భావించారంతా..
 

Image credit: Getty

అయితే ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కి మరో ఛాన్స్ ఇచ్చిన రోహిత్ శర్మ, పొదుపుగా బౌలింగ్ చేస్తూ కీలక సమయంలో బ్యాటుతో పరుగులు సాధిస్తుండడంతో రవిచంద్రన్ అశ్విన్‌ని కూడా తుది జట్టులో కొనసాగించింది. దీంతో యజ్వేంద్ర చాహాల్, రిజర్వు బెంచ్‌కే పరిమితమై, బౌండరీ లైన్ దగ్గర వాటర్ బాయ్‌గా ఫోజులు ఇవ్వడంతోనే సరిపెట్టుకుంటున్నాడు...


ఖాళీ టైమ్‌ని కరెక్టుగా వాడుకుంటున్న యజ్వేంద్ర చాహాల్, భార్య ధనశ్రీ వర్మతో కలిసి బీచ్‌లో విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం ఓ వీడియో కోసం డ్యాన్స్ చేస్తూ గాయపడింది ధనశ్రీ వర్మ. ఆమె కాలికి శస్త్ర చికిత్స జరిగింది. కొన్ని నెలల పాటు డ్యాన్స్‌కి దూరంగా ఉండాలని సూచించారు డాక్టర్లు...

భర్త కోసం ఆస్ట్రేలియాకి చేరుకున్న ధనశ్రీ వర్మ, కాలికి పట్టితోనే కనబడుతోంది. పొట్టి గౌను వేసుకుని, బీచ్‌లో అందంగా ఫోజులు ఇచ్చిన ధనశ్రీ వర్మను ఫోటోలు దింపడంలో యమా బిజీగా గడిపేశాడు క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్. చాహాల్‌తో పాటు క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ధనశ్రీ అందాలను ఫోటోల్లో బంధించాడు...

సూర్యకుమార్ యాదవ్ దింపిన మూడు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ధనశ్రీ వర్మ... అంతేకాదు ధనశ్రీ వర్మ అందాలను కెమెరాలో బంధించడానికి తెగ కష్టపడుతున్న యజ్వేంద్ర చాహాల్‌ని ఫోటో తీశాడు సూర్యకుమార్ యాదవ్...

ఈ ఫోటోలను చూసినవారంతా సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీ బ్యాటర్ మాత్రమే కాదు, 360 డిగ్రీ యాంగిల్స్‌లో కెమెరాను ఎలా వాడాలో కూడా తెలిసిన మంచి కెమెరామెన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు... 

భారత క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్ భార్య ధనశ్రీ వర్మ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోజులు (Source: Instagram/Dhanashree chahal)

భారత క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్ భార్య ధనశ్రీ వర్మ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోజులు (Source: Instagram/Dhanashree chahal)

భారత క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్ భార్య ధనశ్రీ వర్మ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోజులు (Source: Instagram/Dhanashree chahal)

Latest Videos

click me!