ఆ ఇద్దరు ఇటు! జడేజా అటు... చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ట్రేడ్ ముగిసిందా...

First Published | Oct 29, 2022, 1:09 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ సమయంలోనే రవీంద్ర జడేజాకీ, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. చివరిదాకా సీఎస్‌కేలోనే ఉండాలని అనుకున్న జడ్డూ... మేనేజ్‌మెంట్ వ్యవహరించిన తీరుకి చెన్నై సూపర్ కింగ్స్‌కి సంబంధించిన పాత పోస్టులు, ట్వీట్లు, కామెంట్లు కూడా డిలీట్ చేసేశాడు... ఈసారి జడ్డూ, ఢిల్లీ తరుపున ఆడబోతున్నాడా?

jadeja

ఐపీఎల్ 2022 సీజన్‌ ఆరంభానికి ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు మహేంద్ర సింగ్ ధోనీ. దీంతో అందరూ అనుకుంటున్నట్టు రవీంద్ర జడేజాకి కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. ఎప్పటి నుంచో మాహీ తర్వాత సీఎస్‌కే కెప్టెన్‌ని తానేనంటూ చెప్పుకుంటూ వచ్చిన జడ్డూ... భారీ ఆశలతో సీజన్‌ని ఆరంభించాడు..

అయితే 2020 సీజన్‌ని తలపిస్తూ వరుసగా మొదటి 4 మ్యాచుల్లో చిత్తుగా ఓడింది చెన్నై సూపర్ కింగ్స్. ఆ తర్వాత నాలుగు మ్యాచుల్లో 2 విజయాలు అందుకుంది. కెప్టెన్సీ అందుకున్న తర్వాత రవీంద్ర జడేజా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు...


8 మ్యాచులు ముగిసిన తర్వాత ఆటగాడిగా నూరు శాతం పర్ఫామెన్స్ ఇచ్చేందుకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు రవీంద్ర జడేజా. దీంతో మళ్లీ మాహీయే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. ఈ మొత్తం పరిణామాలతో జడేజా బాగా ఫీల్ అయ్యాడు...

జడేజాని కెప్టెన్సీ నుంచి తప్పించాక అతన్ని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసింది చెన్నై సూపర్ కింగ్స్. జడ్డూ కూడా సీజన్ మధ్యలోనే గాయం వంకతో తప్పుకున్నాడు. గాయం చిన్నదే అయినా ఆఖరి 5 మ్యాచుల్లో ఆడనేలేదు రవీంద్ర జడేజా. కొన్నిరోజులకు సీఎస్‌కేకి సంబంధించిన పోస్టులు, కామెంట్లు డిలీట్ చేశాడు జడ్డూ..

ఐపీఎల్ 2023 సీజన్‌లో రవీంద్ర జడేజా, కొత్త జట్టుకి ఆడబోతున్నాడని ప్రచారం జరిగింది. అయితే జడ్డూని రిజర్వు బెంచ్‌లో అయినా కూర్చోబెడతాం కానీ బయటికి పంపించబోమని కామెంట్లు చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్. అయితే జడ్డూ బయటికి వెళ్లాలని డిసైడ్ అయ్యాడట...

jadeja csk

జడేజా వేరే జట్టుకి ఆడాలని నిర్ణయించుకోవడంతో అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌తో ట్రేడ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకుందట సీఎస్‌కే. రవీంద్ర జడేజాని ఐపీఎల్ 2022 సమయంలో రూ.16 కోట్లకు రిటైన్ చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్... దీంతో ఢిల్లీ నుంచి ఇద్దరు ప్లేయర్లు, సీఎస్‌కేలోకి రాబోతున్నారని సమాచారం...

ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్లు శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, వచ్చే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడబోతుంటే... సీఎస్‌కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఢీసీ తరుపున ఆడబోతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది...

ఐపీఎల్ 2021 వరకూ సీఎస్‌కేకి ఆడిన శార్దూల్ ఠాకూర్‌ని రూ.10.75 కోట్ల భారీ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే ఢిల్లీ తరుపున శార్దూల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అలాగే అక్షర్ పటేల్‌ని రూ.9 కోట్లకు రిటైన్ చేసుకుంది.

Axar Patel

 జడేజాని తెచ్చుకుని, ఈ ఇద్దరినీ సీఎస్‌కేకి పంపిస్తే... ఢిల్లీ పర్సులో రూ.3 కోట్ల వరకూ మిగులుతాయి.. దీంతో మరో స్టార్ ప్లేయర్‌ని కొనుగోలు చేయొచ్చని అనుకుంటోందట ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్. 

Latest Videos

click me!