Pakistan Team
జింబాబ్వే- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి 3 బంతుల్లో 3 పరుగులు చేయలేక 2 వికెట్లు కోల్పోయి 1 పరుగు తేడాతో పరాజయం పాలైంది పాకిస్తాన్. ఈ మ్యాచ్‌కి ఇండియాలో మంచి వ్యూయర్‌షిప్ దక్కింది...
Roger Binny
‘పాకిస్తాన్ ఇలా ఓడిపోతే నేను కూడా ఓ సాధారణ టీమిండియా క్రికెట్ ఫ్యాన్‌గా చూసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తా. అందులో తప్పేం లేదు. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో ప్రపంచానికి తెలుసు. మనం ఓడిపోయినా వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటారు...
ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ నాకు బాగా నచ్చింది.ఎందుకంటే ఇలా ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులను ఇండియా- పాక్ మధ్య చూసిన సందర్బాలు చాలా తక్కువ. ఆఖరి వరకూ పాక్ ఆధిపత్యమే సాగింది...
Image credit: Getty
అయితే విరాట్ కోహ్లీ అత్యద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియాని కమ్‌బ్యాక్ చేయించి, గెలిపించాడు. ఆ రోజు విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ నాకు కలలా అనిపించింది. నేను కూడా అలాంటి ఇన్నింగ్స్ ఆడాలని కలలు కన్నా, కోహ్లీ బ్యాటింగ్‌లో దాన్ని చూశా...
Image credit: PTI
విరాట్ కోహ్లీ తనని తాను కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అతను క్లాస్ ప్లేయర్ అని అందరికీ తెలుసు. ప్రెషర్ ఉన్నప్పుడు విరాట్ బ్యాటింగ్ మరో లెవల్‌కి వెళ్లిపోతుంది. టీమిండియా ఆడిన విధానాన్ని మెచ్చుకుని తీరాల్సిందే...
Image credit: PTI
బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌కి వెళ్లాను. 50 ఏళ్ల పాటు కర్ణాటక క్రికెట్‌కి క్రికెటర్‌గా, బోర్డు మెంబర్‌గా బాధ్యతలు చేపట్టా. 1973లో అండర్ 19 టీమ్‌కి సెలక్ట్ అయినప్పటి నుంచి కేఎస్‌సీఏ నన్ను ఎంతగానో ప్రోత్సహించింది...
binny
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో వర్షం కారణంగా మ్యాచులు రద్దు కావడం నిరాశకు గురి చేసింది. వర్షా కాలంలో మ్యాచులు పెడుతున్నప్పుడు ప్రతీ మ్యాచ్‌కి రిజర్వు పెడితే బాగుంటుంది. 1983 వరల్డ్ కప్‌లో అలాగే జరిగింది. జింబాబ్వే, ఐర్లాండ్ టీమ్స్ ఆడిన విధానం నాకెంతో నచ్చింది...
india
చిన్న జట్లే కదా అని తేలిగ్గా తీసుకుంటే రిజల్ట్ తేడా కొడుతుందని ఈ రెండుజట్లు బాగా నిరూపించాయి. ఒకవేళ పాకిస్తాన్, నాకౌట్ స్టేజీకి వచ్చి టీమిండియాతో మరో మ్యాచ్ ఆడితే సంతోషమే...ఇరుదేశాల మధ్య మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ చూడొచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ నయా బాస్ రోజర్ బిన్నీ...