ఆ ఇద్దరినీ వన్డే వరల్డ్ కప్ ఆడించే ఉద్దేశం లేదా? మహ్మద్ షమీ, యజ్వేంద్ర చాహాల్‌లకు...

Published : Aug 01, 2023, 10:17 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. రెండు నెలల్లో ప్రపంచ కప్ మొదలుకానుంది. అయితే ఇప్పటిదాకా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఎవరిని ఆడించాలనే ఉద్దేశంలో టీమిండియాకి క్లారిటీ వచ్చినట్టు కనిపించడం లేదు..

PREV
16
ఆ ఇద్దరినీ వన్డే వరల్డ్ కప్ ఆడించే ఉద్దేశం లేదా? మహ్మద్ షమీ, యజ్వేంద్ర చాహాల్‌లకు...

వెస్టిండీస్ టూర్‌లో 3 వన్డేల సిరీస్ ఆడింది భారత జట్టు. ఈ వన్డే సిరీస్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి వన్డే ఆడినా బ్యాటింగ్‌కి రాలేదు. రోహిత్ శర్మ మిగిలిన రెండు వన్డేలకు దూరంగా ఉన్నాడు..

26

అంతేకాకుండా టీమిండియా వైట్ బాల్ ప్రధాన స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌కి కూడా ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం దక్కలేదు. టీ20 వరల్డ్ కప్ 2021, 2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఆడలేకపోయిన చాహాల్‌ని, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడించేందుకు టీమిండియా ఇష్టపడడం లేదా? అనే అనుమానాలు రేగుతున్నాయి.
 

36

వెస్టిండీస్ టూర్ ముగిసిన తర్వాత ఐర్లాండ్ టూర్‌కి వెళ్లనుంది టీమిండియా.  ఈ టూర్ నుంచి హార్ధిక్ పాండ్యా, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చి.. జస్ప్రిత్ బుమ్రాకి కెప్టెన్సీ అప్పగించింది టీమిండియా... ఏడాది తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడు జస్ప్రిత్ బుమ్రా..

46
Jasprit Bumrah

ఏడాది తర్వాత రీఎంట్రీ ఇస్తున్న జస్ప్రిత్ బుమ్రాకి మ్యాచ్ ప్రాక్టీస్ కోసమే ఐర్లాండ్ టూర్‌కి ఎంపిక చేసింది టీమిండియా. అయితే భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మాత్రం చాలా రోజులుగా క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు..

56
Image credit: PTI

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత వెస్టిండీస్‌ టూర్‌ నుంచి మహ్మద్ షమీని దూరంగా పెట్టింది టీమిండియా. ఐర్లాండ్ టూర్‌లోనూ షమీ ఆడడం లేదు. దీంతో నేరుగా ఆసియా కప్ 2023 టోర్నీలోనే షమీ బరిలో దిగే అవకాశం ఉంది..

66
Image credit: Getty

ఐపీఎల్ 2023 సీజన్‌లో 17 మ్యాచుల్లో 28 వికెట్లు తీసిన మహ్మద్ షమీ పర్పుల్ క్యాప్ గెలిచాడు. 2022 సీజన్‌లో 17 మ్యాచుల్లో 27 వికెట్లు తీసి, ‘పర్పుల్ క్యాప్’ గెలిచాడు యజ్వేంద్ర చాహాల్... చూస్తుంటే ఈ ఇద్దరినీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడించేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్టు లేదు.. 
 

click me!

Recommended Stories