హిందీ పాటలు పాడుతూ సిక్సర్లు కొట్టడం వీరేంద్ర సెహ్వాగ్‌కి బాగా అలవాటు. టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ స్ట్రైయిక్ రేటు, బ్రెండన్ మెక్‌కల్లమ్, ఏబీ డివిల్లియర్స్ వంటి భారీ హిట్టర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. వీరబాదుడు వీరూకి ఛలోక్తులు విసరడంలోనూ ముందుంటాడు...
రికీ పాంటింగ్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా జట్టు, క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన రోజుల్లో కూడా ఇండియాలో టెస్టు సిరీస్ గెలవలేకపోయింది. దానికి కారణం వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి బ్యాటర్లే...
27
Virender Sehwag
తాజాగా ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు వీరేంద్ర సెహ్వాగ్. ‘‘నాకు ఫీల్డింగ్ చేసేటప్పుడు అంపైర్లతో మాట్లాడుతూ ఉండడం చాలా అలవాటు. నేను ఇండియాలో సూపర్ స్టార్‌ని, మీకేమైనా కావాలంటే చెప్పండి, చేసి పెడతా అంటాను...
37
కొందరు అంపైర్లు పట్టించుకోరు, కానీ మరికొందరు అంపైర్లు మాత్రం ఫలానా రెస్టారెంట్‌లో డిన్నర్ చేయాలని ఉందని అడుగుతూ ఉంటారు. నేను వెంటనే వాళ్లకి ఫోన్ చేసి, డిన్నర్ ఏర్పాట్లు చేసి డబ్బులు తీసువద్దని చెప్పేవాడిని...
47
మొహాలీలో నేను 90ల్లో బ్యాటింగ్ చేస్తున్నా... అసద్ రౌఫ్ అంపైర్‌గా ఉన్నాడు. నేను కట్ కొట్టాను, ఆ వాయిస్... మా డ్రెస్సింగ్ రూమ్ దాకా వినిపించింది. ఎందుకంటే మొహాలీలో టెస్టు మ్యాచ్ చూడడానికి జనాలు పెద్దగా రారు..
57
Virender Sehwag
చాలా పెద్దగా సౌండ్ వచ్చింది కానీ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. రికీ పాంటింగ్ నా దగ్గరికి వచ్చి, బ్యాటు తగిలిందా? అని అడిగాడు. నేను తగిలిందని చెప్పాను. బ్యాటు తగిలితే ఎందుకు వెళ్లలేదని అడిగాను..
67
Sehwag-Ganguly
దానికి నేను, నువ్వు ఎప్పుడూ అలా వెళ్లవు? నన్ను ఎందుకు అడుగుతున్నావ్? వెళ్లి అంపైర్‌ని అడుగు... అని సమాధానం ఇచ్చా. రికీ పాంటింగ్ వెంటనే అంపైర్ దగ్గరికి వెళ్లి, సెహ్వాగ్ తన బ్యాటుకి తగిలిందని చెప్పాడని చెప్పాడు...
77
అప్పుడు అంపైర్ అసద్ రౌఫ్, రికీ పాంటింగ్‌ని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. బ్యాటుకి తగిలిందా? అని అడిగాడు? నేను వెంటనే లేదు, నేను అలా చెప్పలేదు. పాంటింగ్ అబద్ధం చెబుతున్నాడని చెప్పా... దానికి రికీ పాంటింగ్ ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నాడు...’’ అంటూ చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్..