రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌ ఓపెనింగ్ చేస్తే, ఇషాన్ కిషన్‌ ఎందుకు? వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముందు..

Published : Aug 01, 2023, 07:51 PM IST

2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీ మొత్తంలో కేవలం 12 మంది ప్లేయర్లను మాత్రమే వాడింది టీమిండియా. అండర్‌ డాగ్స్‌గా బరిలో దిగి, అత్యద్భుత ఆటతీరుతో ఫైనల్‌కి దూసుకొచ్చింది. 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ముందు నాలుగేళ్ల పాటు దాదాపు ఒకే ప్లేయింగ్ ఎలెవన్‌‌ని ఆడించింది టీమిండియా..

PREV
110
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌ ఓపెనింగ్ చేస్తే, ఇషాన్ కిషన్‌ ఎందుకు? వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముందు..

2017 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో పెద్దగా మార్పులు జరగలేదు. అయితే ఆ తర్వాతే టీమ్ విషయంలో క్లారిటీ మిస్ అవుతూ వస్తోంది. 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ఒకటికి నలుగురు వికెట్ కీపర్లను ఎంపిక చేశారు సెలక్టర్లు...

210

నాలుగో స్థానంలో రాణిస్తూ వస్తున్న అంబటి రాయుడిని పక్కనబెట్టి విజయ్ శంకర్‌ని ఆడించడం హాట్ టాపిక్ అయ్యింది. రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, మహేంద్ర సింగ్ ధోనీ... ఇలా టీమ్‌లో నలుగురు వికెట్ కీపర్లతో బరిలో దిగిన జట్టు టీమిండియా ఒక్కటే..

310

2021 టీ20 వరల్డ్ కప్ సమయంలో శిఖర్ ధావన్, యజ్వేంద్ర చాహాల్‌ని పక్కనబెట్టి, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్‌లను ఆడించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అప్పటిదాకా నాలుగేళ్లుగా టీ20లకు దూరంగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌ని, పొట్టి ప్రపంచకప్ కోసం పట్టుకొచ్చారు సెలక్టర్లు..

410

2022 టీ20 వరల్డ్ కప్‌కి యజ్వేంద్ర చాహాల్‌ని ఎంపిక చేసినా అతన్ని ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడించలేదు. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు టీమిండియా చేస్తున్న ప్రయోగాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే...

510

గత ఏడాది ఐదు - ఆరు రకాల ఓపెనింగ్ జోడీలను ప్రయత్నించిన టీమిండియా మేనేజ్‌మెంట్, ఈ ఏడాది కూడా ప్రయోగాలను ఆపడం లేదు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ కలిసి ఓపెనింగ్ చేశారు. తొలి వన్డేలో లక్ష్యం తక్కువగా ఉండడంతో ఈ ఇద్దరూ ఓపెనింగ్ చేశారని ఫ్యాన్స్ సర్దిచెప్పుకున్నారు..

610

అయితే రెండో వన్డే నుంచి రోహిత్‌ శర్మను పూర్తిగా టీమ్‌లో నుంచే తొలగించారు. చూస్తుంటే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ గురించి కాకుండా, రోహిత్ శర్మ రిటైర్ అయ్యాక ఓపెనింగ్ జోడి కోసం టీమిండియా ఈ వన్డే సిరీస్‌ని చూస్తున్నట్టు అర్థమవుతోంది...
 

710

మరో రకంగా చెప్పాలంటే టీమిండియా ఎలాగో వన్డే వరల్డ్ కప్ గెలవదు! వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అయితే శుబ్‌మన్ గిల్‌తో ఎవరు ఓపెనింగ్ చేస్తే బాగుంటుందనే కోణంలో ఇషాన్ కిషన్‌ని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది...

810
Ishan Kishan

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ ఆడతాడో తెలియక ఇన్ని ప్రయోగాలు చేస్తున్నామని రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. అయితే ఆ ఇద్దరూ ఆడకపోయినా ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో ఇన్ని ప్రయోగాలు చేయాల్సిన స్థితిలో అయితే టీమిండియా లేదు..

910

రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేస్తే వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత సంజూ శాంసన్ లేదా ఇషాన్ కిషన్‌ని ఆడించి.. రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ లేదా మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్.. ఇలా పర్ఫెక్ట్ ప్లేయింగ్ ఎవెలన్‌‌లో సీనియర్ల టీమ్ సిద్ధంగా ఉంది.

1010
Kuldeep Yadav

అయినా టీమిండియా చేస్తున్న ప్రయోగాలు, టీమ్‌కి మంచి చేయకపోయినా... ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చిన టీమ్ వాతావరణం చెడిపోయే ప్రమాదం ఉంది. సుదీర్ఘ అనుభవం ఉన్న రాహుల్ ద్రావిడ్‌, రోహిత్ శర్మలకు ఈ విషయం తెలియనిది కాదు, అయినా ఎందుకు ఈ ప్రయోగాలు అనేది జనాలకు అర్థం కాని విషయం.. 

Read more Photos on
click me!

Recommended Stories