యజ్వేంద్ర చాహాల్‌ని తప్పించడానికే గాయం వంక? అనుమానాలు రేపుతున్న ఇన్‌స్టా స్టోరీ...

Published : Jan 12, 2023, 03:07 PM IST

ఒకప్పుడు ఓ యంగ్ ప్లేయర్ టీమ్‌లోకి రావాలంటే, సీనియర్ ప్లేయర్లు గాయపడిదాకా వేచి చూడాల్సి వచ్చింది. గంగూలీ, ధోనీ హయాంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చాలా అరుదుగా జరిగేవి. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది... డబుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా యంగ్ ప్లేయర్లకు తర్వాతి మ్యాచ్‌లో చోటు దక్కని పరిస్థితి వచ్చేసింది..

PREV
18
యజ్వేంద్ర చాహాల్‌ని తప్పించడానికే గాయం వంక? అనుమానాలు రేపుతున్న ఇన్‌స్టా స్టోరీ...

రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్లను పక్కనబెట్టడానికి గాయం సాకును తెగ వాడేస్తున్నాడు. ఓ ప్లేయర్‌ని తప్పించామని చెప్పకుండా, గాయపడ్డాడని, కోలుకుంటున్నాడని చెబుతున్నారు..
 

28

తాజాగా శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో యజ్వేంద్ర చాహాల్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌కి చోటు కల్పించింది టీమిండియా మేనేజ్‌మెంట్. తొలి వన్డేలో 10 ఓవర్లలో 58 పరుగులిచ్చిన యజ్వేంద్ర చాహాల్ ఓ వికెట్ తీశాడు...

38
Image credit: Getty

మరో స్పిన్నర్ అక్షర్ పటేల్, తన 10 ఓవర్ల కోటాలో 58 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే అక్షర్ పటేల్ బ్యాటింగ్ కూడా చేయగలడు. దీంతో అక్షర్ పటేల్‌ని కొనసాగించి యజ్వేంద్ర చాహాల్‌పై వేటు వేసింది టీమిండియా...

48

నాలుగేళ్లుగా టీమిండియాకి వైట్ బాల్ క్రికెట్‌లో ప్రధాన బౌలర్‌గా ఉంటూ వచ్చాడు యజ్వేంద్ర చాహాల్. అయితే 2021 టీ20 వరల్డ్ కప్ నుంచి యజ్వేంద్ర చాహాల్ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో చాహాల్‌కి చోటు దక్కలేదు..

58
Image credit: PTI

2022 టీ20 వరల్డ్ కప్‌ టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో యజ్వేంద్ర చాహాల్‌కి చోటు దక్కినా, ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఏదో హానీమూన్‌కి తీసుకెళ్లినట్టుగా చాహాల్‌ని, అతని భార్యని ఆస్ట్రేలియా తీసుకెళ్లి తీసుకొచ్చింది బీసీసీఐ...
 

68
Image credit: PTI

యజ్వేంద్ర చాహాల్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడని, ఆ గాయం నుంచి కోలుకోని కారణంగా కుల్దీప్ యాదవ్‌కి తుది జట్టులో అవకాశం కల్పించామని టాస్ సమయంలో వ్యాఖ్యానించాడు రోహిత్ శర్మ. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు ‘మ్యాచ్ డే...’ అంటూ రెండో వన్డే కోసం సిద్ధంగా ఉన్నట్టు పోస్ట్ చేశాడు యజ్వేంద్ర చాహాల్...

78
Chahal

చాహాల్ పోస్టుని బట్టి చూస్తే అతనికి అయిన గాయం అంత పెద్దదేమీ కాదు. కేవలం తుది జట్టులో అతనికి చోటు ఇవ్వడం ఇష్టం లేకనే గాయం వంక వాడినట్టు తెలుస్తోందని అంటున్నారు అభిమానులు...

88
Kuldeep Yadav

బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్, శ్రీలంకతో రెండో వన్డేలో బౌలింగ్‌కి వచ్చిన మొదటి ఓవర్‌లోనే వికెట్ తీశాడు. నేటి మ్యాచ్‌లో కుల్దీప్ బాగా ఆడితే అతనికి మూడో వన్డేలో చోటు దక్కుతుందా? లేక మళ్లీ రిజర్వు బెంచ్‌లోకే వెళ్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది.. 

click me!

Recommended Stories