రిషబ్ పంత్‌కి టెస్టు పగ్గాలు? రేసులో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్... టీమిండియా తర్వాతి టెస్టు కెప్టెన్ ఎవరు..

Published : Jan 16, 2022, 11:16 AM IST

సడెన్‌గా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఎవ్వరూ ఊహించని ఈ నిర్ణయంతో క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది. ఇప్పుడు  టీమిండియా తర్వాతి టెస్టు కెప్టెన్ ఎవరనే దానిపై ఉత్కంఠ రేగుతోంది..

PREV
112
రిషబ్ పంత్‌కి టెస్టు పగ్గాలు? రేసులో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్... టీమిండియా తర్వాతి టెస్టు కెప్టెన్ ఎవరు..

ఆస్ట్రేలియా టూర్‌లో విరాట్ కోహ్లీ గైర్హజరీలో జట్టును అద్భుతంగా నడిపించిన అజింకా రహానే... భారత జట్టుకి సిరీస్ విజయాన్ని అందించాడు. 

212

రహానే కెప్టెన్సీలో ఐదు టెస్టులాడిన టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అన్ని సరిగా ఉంటే విరాట్ కోహ్లీ తప్పుకుంటే టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అజింకా రహానేకే దక్కేవి...

312

అయితే మెల్‌బోర్న్ టెస్టు తర్వాత సరైన ఫామ్‌లో లేక పరుగులు చేయడానికి తెగ ఇబ్బందిపడుతున్నాడు అజింకా రహానే. పేలవ ఫామ్‌తో టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ కూడా కోల్పోయాడు...

412

గాయం కారణంగా సిరీస్‌కి దూరం కాకముందు సౌతాఫ్రికా టూర్‌కి రోహిత్ శర్మ టెస్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. లెక్క ప్రకారం అయితే వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకు టెస్టు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి...

512

అయితే ఇప్పుడు రోహిత్ శర్మ వయసు 34 ఏళ్లు. ఈ వయసులో వన్డే, టీ20లతో పాటు టెస్టు కెప్టెన్సీ పగ్గాలు తీసుకోవడం అంటే అంత తేలికైన విషయం కాదు... కాబట్టి రోహిత్‌కి టెస్టు పగ్గాలు దక్కకపోవచ్చని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

612

విరాట్ కోహ్లీ గైర్హజరీలో జోహన్‌బర్గ్‌లో జరిగిన ఇండియా, సౌతాఫ్రికా రెండో టెస్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు కెఎల్ రాహుల్. అయితే రాహుల్ కెప్టెన్సీ క్రికెట్ ఫ్యాన్స్‌ని పెద్దగా మెప్పించలేకపోయింది...

712

కెఎల్ రాహుల్ కెప్టెన్సీపై చాలాకాలంగా విమర్శలు ఉన్నాయి. అయితే రోహిత్ శర్మకు టెస్టు కెప్టెన్సీ ఇచ్చేకంటే కెఎల్ రాహుల్ ఇవ్వడమే కరెక్ట్ అని చాలామంది బీసీసీఐ అధికారులు భావిస్తున్నట్టు సమచారం...

812

అయితే టెస్టుల్లో జట్టును నడిపించడం అంత తేలికైన విషయం కాదు. ఎంతో ఓపిక, సహనంతో పాటు ప్రత్యర్థి ఆటతీరుకు తగ్గట్టుగా ప్రణాళికలు మార్చగల నైపుణ్యం... టెస్టు సారథికి చాలా అవసరం...

912

కెఎల్ రాహుల్, రోహిత్ శర్మల కంటే ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉన్న రిషబ్ పంత్‌కి టెస్టు కెప్టెన్సీ ఇవ్వాలని అంటున్నారు మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, యువరాజ్ సింగ్...

1012

‘వికెట్ల వెనకాల నుంచి ఆటను పక్కగా అర్థం చేసుకోగలిగిన రిషబ్ పంత్‌కి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు ఇస్తే బాగుంటుంది...’ అంటూ ట్వీట్ చేశాడు యువరాజ్ సింగ్...

1112

‘కెఎల్ రాహుల్ కంటే రిషబ్ పంత్‌కి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు ఇస్తే బాగుంటుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఉండే అగ్రెసివ్, దూకుడు రిషబ్ పంత్‌ కెప్టెన్సీలో స్పష్టంగా కనిపిస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్...

1212

వచ్చే నెలలో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది భారత జట్టు. ఆ సిరీస్‌కి జట్టును ప్రకటించేటప్పుడు తర్వాతి భారత టెస్టు సారథి ఎవరనేది ప్రకటించే అవకాశం ఉంది...

Read more Photos on
click me!

Recommended Stories