నీకు థ్యాంక్స్ చెబితే సరిపోదు.. అంతకుమించి.. కింగ్ కోహ్లిపై మహ్మద్ సిరాజ్ ఎమోషనల్ పోస్ట్

First Published Jan 18, 2022, 12:55 PM IST

Mohammed Siraj About Virat Kohli: తనలోని ప్రతిభను గుర్తించి.. తన ఉన్నతికి కారణమైన  విరాట్ కోహ్లికి మహ్మద్ సిరాజ్ భావోద్వేగ లేఖ రాశాడు. క్రికెట్ ఆడినంత కాలం తనకు కింగ్ కోహ్లినే కెప్టెన్ అని పేర్కొన్నాడు.  
 

తన కెరీర్ లో ఎదగడానికి ఊతమిచ్చిన సారథి విరాట్ కోహ్లిపై టీమిండియా పేసర్, హైదరాబాద్ కు చెందిన  మహ్మద్ సిరాజ్ ప్రశంసలు కురిపించాడు.

తనకు థ్యాంక్స్ చెబితే సరిపోదని, అతడితో  తన బంధం అంతకుమించినదని  సిరాజ్ పేర్కొన్నాడు.  టెస్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో సిరాజ్.. సోషల్ మీడియా వేదికగా  భావోద్వేగా లేఖ రాశాడు. 

సిరాజ్ స్పందిస్తూ.. ‘నా సూపర్ హీరోకు.. నన్ను నమ్మి నాకు మద్దతుగా నిలిచినందుకు, నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహించినందుకు నేను నీకు రుణపడి ఉంటానని చెబితే సరిపోదు.. 
 

ఎందుకంటే నువ్వు నాకు అంతకుమించి.. నా పెద్దన్నయ్య వంటి వాడివి. నా  సోదరుడివి. నా పై నమ్మకముంచి కెరీర్ లో ఎదిగేలా ప్రోత్సాహం అందించినందుకు  ధన్యవాదాలు.. 

నేను సరిగా ఆడలేక కుంగిపోయినప్పుడు కూడా నాలోని గొప్ప ఆటగాడిని చూడగలిగినందుకు కృతజ్ఞతలు.. నువ్వెప్పుడూ నా కెప్టెన్ కింగ్ కోహ్లివే..’ అంటూ రాసుకొచ్చాడు. 
 

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున విరాట్ సారథ్యంలో ఆడని సిరాజ్.. జాతీయ జట్టులోకి రావడం అక్కడ్నుంచి అవకాశాలను అందిపుచ్చుకుని టీమిండియా స్టార్ పేసర్ గా ఎదగడంలో కోహ్లిది కీలక పాత్ర అని అందరికీ తెలిసిందే. 
 

2020-21 లో భారత జట్టు ఆస్ట్రేలియాకు పర్యటించినప్పుడు అప్పుడే అరంగ్రేటం చేసిన సిరాజ్.. ఆ సిరీస్ లో భారత్ తరఫున అదరగొట్టే ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ గడ్డ మీద ఇంగ్లీష్ బ్యాటర్లను వణికించాడు.  లార్డ్స్ తో పాటు ఆ సిరీస్ లో భారత్ ఆధిక్యం సాధించడంలో కూడా బౌలింగ్ విభాగంలో సిరాజ్  ముఖ్య భూమిక పోషించాడు. 

click me!