ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా భారత జట్టులోకి మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు దినేశ్ కార్తీక్. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో, ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్‌లలో ఆకట్టుకున్న దినేశ్ కార్తీక్... వెస్టిండీస్ టూర్‌లోనూ పాల్గొనబోతున్నాడు. విండీస్ టూర్‌కి ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు దినేశ్ కార్తీక్...
కొంత కాలంగా తన స్థాయిలో పర్పామెన్స్ ఇవ్వలేకపోతున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. ప్రపంచదేశాల క్రికెటర్లు, విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తల్లో నిలవాలని చూస్తున్నారు...
27
Virat Kohli
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 11, రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ... టీ20 సిరీస్‌లో రెండు మ్యాచుల్లో 12, వన్డే సిరీస్‌లో రెండు వన్లేల్లో కలిపి 33 పరుగులు మాత్రమే చేయగలిగాడు...
37
Image credit: PTI
‘విరాట్ కోహ్లీ కొన్ని సంవత్సరాలుగా ఎవ్వరూ ఊహించని విధంగా సక్సెస్ అవుతూ వచ్చాడు. ఇంత తక్కువ కాలంలో అతను సాధించిన పరుగులు, నెలకొల్పిన రికార్డులు అనితర సాధ్యం...
47
Image credit: PTI
అతనికి ఇప్పుడు కాస్త బ్రేక్ కావాలి. మంచి బ్రేక్ దొరికితే విరాట్ కోహ్లీ ఫుల్లీ రిఛార్జ్ అయ్యి కమ్‌బ్యాక్ ఇస్తాడు. అతని కమ్‌బ్యాక్ కూడా అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నా. ఏ ప్లేయర్‌ని అయినా జట్టులో నుంచి తప్పించగలరేమో కానీ అతని క్యాలిబర్‌ని తీసేయలేరుగా...
57
Image credit: PTI
నేను రీఎంట్రీ ఇచ్చేందుకు చాలా కష్టపడ్డాను. ఎంతో కఠినంగా శ్రమిస్తే కానీ తిరిగి జట్టులోకి రాలేకపోయాను. ఇప్పుడు భారత జట్టుకి ఉన్న రిజర్వు బెంచ్ అంత బలంగా ఉంది... పోటీ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. భారత జట్టులో ఉన్న అందం అదే...
67
Image credit: PTI
జట్టుగా మేం ఒక్కో ఛాలెంజ్‌కి ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతున్నాం. వచ్చే వరల్డ్ కప్ సమయానికి ఏ లోటు లేకుండా పటిష్టంగా తయారుకావాలనేదే మా ముందున్న లక్ష్యం...
77
జట్టులో ఎప్పుడూ పాజిటివ్ వాతావరణం ఉండేలా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ జాగ్రత్తలు తీసుకుంటున్నారు... ’ అంటూ కామెంట్ చేశాడు భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్..