అవకాశముంటే కోహ్లీకి మళ్లీ బౌలింగ్ చేయాలనుంది..! రిటైర్మెంట్ హింట్ వదిలిన మరో ఇంగ్లాండ్ పేసర్

Published : Jul 19, 2022, 02:34 PM IST

James Anderson vs Virat Kohli: ఇంగ్లాండ్ కు టెస్టులలో దిగ్గజ బౌలర్ గా అత్యున్నత శిఖరాలు అధిరోహించిన ఆ జట్టు పేసర్  జేమ్స్ అండర్సన్ కూడా బెన్ స్టోక్స్ బాటలోనే నడుస్తున్నాడా..? 

PREV
18
అవకాశముంటే కోహ్లీకి మళ్లీ బౌలింగ్ చేయాలనుంది..! రిటైర్మెంట్ హింట్ వదిలిన మరో ఇంగ్లాండ్ పేసర్

క్రికెట్ లో బ్యాట్ కు బంతికి జరిగే సమరాలలో కొన్ని ప్రత్యేకమైనవి. గత తరంలో అయితే సచిన్ టెండూల్కర్-షోయభ్ అక్తర్, సౌరవ్ గంగూలీ-షాన్ పొలాక్, రికీ పాంటింగ్-హర్భజన్ సింగ్ ల మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండేది. 

28

ఆధునిక క్రికెట్ లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్  ల మధ్య సమరం కూడా పైన పేర్కొన్నవారి ఆటతో పోల్చితే ఏమాత్రం తక్కువ కాదు. ప్రపంచ క్రికెట్ లో దిగ్గజాలుగా పేరొందిన ఇద్దరు  గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) ల మధ్య బ్యాట్-బాల్ సమరం ఒక యుద్ధంలా ఉండేది. ఆధిపత్యం మారినప్పుడల్లా వారి ఆటతో పాటు భావోద్వేగాలు, హావబావాలు ప్రేక్షకులకు మరింత మజాను పంచేవి. 

38

అయితే నలభయ్యవ పడిలో పడుతున్న  అండర్సన్.. ఇక క్రికెట్ లో కొనసాగడం అనుమానమేనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ  ఇద్దరి మధ్య ఇటీవలే జరిగిన ఎడ్జబాస్టన్ లో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టే చివరిసమరమని వార్తలు కూడా వచ్చాయి. 
 

48

తనకు మాత్రం కోహ్లీకి మళ్లీ బౌలింగ్  చేయాలని ఉందని ఈ స్టార్ పేసర్ తన మనసులోని కోరికను బయటపెట్టాడు.  కోహ్లీ, భవిష్యత్ ప్రణాళికలు ఏంటని  ప్రశ్నించిన మీడియాతో అండర్సన్ మాట్లాడుతూ.. ‘నాక్కూడా తెలియదు.  కానీ నాకు విరాట్ కు బౌలింగ్ చేయడం చాలా ఇష్టం.  వచ్చే టూర్ వరకు నేను ఆడగలిగితే అది జరగొచ్చు..’ అని అన్నాడు. 

58

ఈ దిగ్గజ ఆటగాళ్ల మధ్య 2011 నుంచి బ్యాట్ - బంతి సమరం మొదలైంది. టెస్టులలో అండర్సన్..  ఏడుసార్లు ఔట్ చేశాడు. టెస్టులలో అండర్సన్ బౌలింగ్ లో కోహ్లీ  710 బంతులాడి 305 పరుగులు చేశాడు.  ఇందులో 39 ఫోర్లు కూడా ఉన్నాయి. వన్డేలలో 38 బంతులాడి  26 పరుగులు చేశాడు.  3 సార్లు ఔటయ్యాడు.

68

అయితే ఇప్పటికే నలభైలో చేరబోతున్న అండర్సన్.. త్వరలోనే  తన సుదీర్ఘ  కెరీర్ కు గుడ్ బై చెప్తాడని ఇంగ్లాండ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ టెస్టు సారథి బెన్ స్టోక్స్ సోమవారం వన్డేల నుంచి వైదొలిగిన తర్వాత అక్కడి మీడియాలో అండర్సన్ రిటైర్మెంట్  గురించి చర్చ జరిగింది. 

78

ఇదిలాఉండగా 2024 దాకా ఇంగ్లాండ్  తో టీమిండియా మళ్లీ టెస్టు సిరీస్ ఆడే అవకాశాలైతే లేవు. కానీ అప్పటిదాకా జేమ్స్ అండర్సన్ ఆడతాడా..?   అనేది అనుమానమే. 

88

తన సుదీర్ఘ కెరీర్ లో అండర్సన్.. 172 టెస్టులలో 657 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ తర్వాత స్థానంలో నిలిచాడు.

Read more Photos on
click me!

Recommended Stories