Rahul Dravid-Rohit Sharma
కెప్టెన్‌గా ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్‌గా మాత్రం ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలు రోహిత్ శర్మ కెరీర్‌కి కీలకంగా మారాయి..
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ గడువు కూడా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీతో ముగియనుంది. ఆ తర్వాత ద్రావిడ్, హెడ్ కోచ్‌గా కొనసాగడానికి ఇష్టపడకపోవచ్చు...
‘రాహుల్ ద్రావిడ్ అంటే నాకెంతో గౌరవం. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. క్రికెటర్‌గా ఆయనేంటో అందరికీ తెలుసు. క్రికెటర్, ఫుట్‌బాల్ ప్లేయర్, డాక్టర్ జీవితంలో ఏది కావాలన్ని అంతకంటే ముందు మంచి మనిషిగా ఉండాలి..
Virat Kohli Rahul Dravid
రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలోనే నేను అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాను. అయితే ఆయన కెప్టెన్సీలో ఎక్కువ కాలం ఆడలేకపోయా. అయినా నాకు ప్రతీ విషయాన్ని చెప్పారు. కమ్యూనికేషన్ చాలా ముఖ్యమని ద్రావిడ్ నమ్ముతారు..
రాహుల్ ద్రావిడ్ మొదటి రూల్ అదే. సపోర్టింగ్ స్టాఫ్, ప్లేయర్ల మధ్య ఎలాంటి గ్యాప్ ఉండకూడదు. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నాం. ప్రతీ ప్లేయర్ ప్రతీ విషయాన్ని కోచ్‌తో, కెప్టెన్‌తో పంచుకోవచ్చు.. ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..