ఆసియా కప్‌ రిజర్వు డే చిచ్చు! కోచ్‌ల అసంతృప్తి... బంగ్లాదేశ్, లంక టీమ్‌ని చులకనగా చూస్తున్నారంటూ..

First Published | Sep 9, 2023, 2:20 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీ ఆరంభం నుంచి వివాదాస్పదం అవుతూనే ఉంది. పాక్‌లో నిర్వహించాల్సిన ఆసియా కప్, టీమిండియా ఒత్తిడి కారణంగా హైబ్రీడ్ మోడల్‌లో జరుగుతోంది. అయితే శ్రీలంకలో వర్షాల కారణంగా మ్యాచులు సజావుగా పూర్తి కావడం లేదు..
 

ఇండియా - పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దు అయ్యింది. అయితే సూపర్ 4 రౌండ్‌లో భాగంగా సెప్టెంబర్ 10న ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌కి రిజర్వు డే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఆసియా క్రికెట్ కౌన్సిల్..

సూపర్ 4 రౌండ్‌లో ఓ మ్యాచ్ లాహోర్‌లో జరగగా కొలంబోలో మిగిలిన 5 మ్యాచులు జరగాల్సి ఉంది. అయితే ఇందులో కేవలం ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌కి మాత్రమే రిజర్వు డే కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమవుతోంది..

Latest Videos


బంగ్లాదేశ్, శ్రీలంక ఆడే మ్యాచులకు రిజర్వు డే లేకపోవడంపై ఆ రెండు జట్ల హెడ్ కోచ్‌లు అసంతృప్తి వ్యక్తం చేశారు.  ‘ఇది కరెక్ట్ కాదు. మాకు కూడా రిజర్వు డే కేటాయించాలి. ఆసియా కప్‌లో 6 జట్లు ఆడుతున్నాయి. కేవలం రెండు జట్లను మాత్రమే స్పెషల్‌గా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు..’ అంటూ శ్రీలంక హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ కామెంట్ చేశాడు..

India Vs Pakistan

‘భారత్ - పాక్ మ్యాచ్‌కి మాత్రమే రిజర్వు డే కేటాయించడం చూసి నేను షాక అయ్యా. అయితే ఆసియా కప్ టోర్నీని మేం నిర్వహించడం లేదు. కాబట్టి దీని గురించి కామెంట్ చేయాలని అనుకోవడం లేదు..’ అంటూ కామెంట్ చేశాడు బంగ్లాదేశ్ హెడ్ కోచ్ చంద్రిక హతురసింఘ
 


శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు మాత్రం ఈ విషయంపై సానుకూలంగా స్పందించాయి. ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌కి రిజర్వు డే కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం, తమను సంప్రదించే తీసుకున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి లంక క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు..

India vs Pakistan Rain

భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించాడు. ‘భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కి మాత్రమే రిజర్వు డే పెట్టడం సిగ్గుచేటు. ఇది అనైతిక చర్య. ఓ టోర్నీ నిర్వహించేటప్పుడు అందులో ఆడే అన్ని జట్లకు సమానమైన విలువ ఇవ్వాలి.

కేవలం ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌కి క్రేజ్ ఉందని, దానికి మాత్రమే రిజర్వు డే పెట్టడం అన్యాయం.  బంగ్లాదేశ్, లంక టీమ్‌ని చులకనగా చూస్తున్నారు. అయినా రిజర్వు డే రోజున ఇంకా ఎక్కువ వర్షం పడితే మీ ఈ దొంగ ప్లాన్స్ వర్కవుట్ అవుతాయా?’ అంటూ ట్వీట్ చేశాడు వెంకటేశ్ ప్రసాద్.. 

click me!