ఇతను రోహిత్ శర్మ కాదు, అతని డూప్‌లా ఆడుతున్నాడు... పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ కామెంట్స్..

Published : Sep 08, 2023, 03:55 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో రోహిత్ శర్మ ఇరగదీస్తాడని నమ్ముతున్నారు చాలా మంది మాజీ క్రికెటర్లు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో 5 సెంచరీలు బాదిన రోహిత్ శర్మ, ఈసారి కూడా అదే రేంజ్‌లో అదరగొడతాడని సౌరవ్ గంగూలీ, సంజయ్ మంజ్రేకర్, వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించారు..

PREV
17
ఇతను రోహిత్ శర్మ కాదు, అతని డూప్‌లా ఆడుతున్నాడు... పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ కామెంట్స్..

టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అయితే, ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో రోహిత్ శర్మ రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ కూడా బాదేస్తాడని జోస్యం చెప్పాడు...

27
Rohit Sharma Bowled


పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 22 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసిన రోహిత్ శర్మ, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 2021 టీ20 వరల్డ్ కప్‌లో ఇన్నింగ్స్ మొదటి బంతికే రోహిత్, షాహీన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు..

37

అంతకుముందు 2011 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 140 పరుగులతో అద్భుత సెంచరీ బాదాడు.  ఈ సెంచరీ కారణంగా పాకిస్తాన్‌పై ఈజీ విక్టరీ అందుకున్న టీమిండియా, గ్రూప్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్ చేరింది..

47
Rohit Sharma vs Shaheen Shah Afridi

‘ఈ రోహిత్ శర్మ, ఆ రోహిత్ శర్మలా కనిపించడం లేదు. ఇతను రోహిత్ శర్మ డూప్‌లా ఆడుతున్నాడు. అతని బుర్రలో షాహీన్ అంటే భయం ఉన్నట్టు క్లియర్‌గా కనిపిస్తోంది...

57

రోహిత్ శర్మను ఎప్పుడూ ఇలా చూడలేదు. అసలేం జరిగిందో కూడా అర్థం కావడం లేదు. కెప్టెన్సీ తీసుకున్న తర్వాత రోహిత్ ఆట తీరు చాలా మారింది. ఇంతకుముందులా అయితే కనిపించడం లేదు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌ మ్యాచ్‌లో ప్రెషర్ ఉంటుంది..

67
Rohit Sharma-Babar Azam

అయితే ఎంత ప్రెషర్ ఉన్నా రోహిత్ శర్మ నుంచి ఇలాంటి ఆటతరు అయితే అస్సలు ఊహించలేదు. 2021 టీ20 వరల్డ్ కప్ నుంచి గత ఐదు మ్యాచుల్లోనూ రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడు.

77
Rohit Sharma_Shubman Gill

ఒక్కసారి అంటే అనుకోవచ్చు, వరుసగా ఇలా ఫెయిల్ అయితే మాత్రం ఏదో సమస్య ఉన్నట్టే కదా..’ అంటూ వ్యాఖ్యానించాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్..

Read more Photos on
click me!

Recommended Stories