Team India Opening Pair: ఇటీవలి కాలంలో భారత జట్టు చేస్తున్న ప్రయోగాలలో ఓపెనర్ల్ జోడీ కూడా ఉంది. గడిచిన ఐదారునెలలలో భారత జట్టు ఏకంగా ఆరు ఓపెనింగ్ భాగస్వామ్యాలను మార్చింది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఈ ప్రయోగాలు చేస్తున్నది.
రోహిత్ శర్మ-కెఎల్ రాహుల్ లు టీ20లలో రెగ్యులర్ ఓపెనర్లుగా ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో ఈ ఇద్దరూ కలిసి ఆడిన సందర్భాలూ చాలా తక్కువ. ఒకరికి గాయమైతే ఒకరికి విశ్రాంతి అన్నట్టుగా సాగుతుంది వీళ్ల ప్రయాణం. గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిశాక ఈ ఇద్దరూ ఓపెనింగ్ కు వచ్చింది లేదు.
27
Image credit: PTI
ఆ తర్వాత భారత జట్టు రోహిత్ శర్మ - ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ - రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ - ఇషాన్ కిషన్, దీపక్ హుడా- ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ -ఇషాన్ కిషన్ లను ప్రయత్నించింది. ఇంగ్లాండ్ సిరీస్ లో రోహిత్ శర్మ - రిషభ్ పంత్ లు కూడా ఓపెనర్లుగా వచ్చారు.
37
ఇక వెస్టిండీస్ తో టీ20 సిరీస్ లో రోహిత్ శర్మ-సూర్యకుమార్ యాదవ్ లు ఓపెనర్లుగా మారారు. కెఎల్ రాహుల్ వస్తే పరిస్థితులు ఎలా మారతాయో గానీ ఇప్పటికైతే ఓపెనర్ల వేట ఇంకా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా భారత జట్టుకు కీలక సూచన చేశాడు. ఓపెనర్ల ప్రయోగాలలో భాగంగా పృథ్వీ షా ను కూడా ప్రయత్నించొచ్చని అన్నాడు. షా కూడా మెరుగైన ఓపెనర్ అని, అతడిని బ్యాకప్ గా పెట్టుకోవాలని సూచించాడు.
47
దీప్ దాస్ మాట్లాడుతూ.. ‘టీ20 ప్రపంచకప్ కోసం ఓపెనర్లుగకా రోహిత్ శర్మ - కెఎల్ రాహుల్ లు నా మొదటి ఛాయిస్ ఓపెనర్లు. ఒకవేళ మూడో ఓపెనర్ (బ్యాకప్) కోసం చూస్తున్నట్టైతే మీరు పృథ్వీ షా ను ట్రై చేయొచ్చు. ఓపెనర్ గా అతడు మంచి ఆప్షన్. ఇన్నింగ్స్ ను ఆరంభించడంలో అతడి శైలి ప్రత్యేకం.
57
షా 70, 80 లు సెంచరీలు చేయకపోవచ్చు. కానీ ఓపెనర్ గా అతడు సృష్టించే విధ్వంసం మాత్రం అంతా ఇంతా కాదు. ఓపెనర్ గా ఇషాన్ కిషన్ కూడా బాగానే రాణించాడు. కానీ గత కొంతకాలంగా అతడు లయ తప్పాడు..’ అని తెలిపాడు.
67
అంతేగాక ఒక జట్టులో ముగ్గురు నలుగురు వికెట్ కీపర్ బ్యాటర్లు ఉంటే నష్టమేమీ లేదని దీప్ దాస్ గుప్తా అన్నాడు. వాళ్లను వివిధ స్థానాలలో ఎలా వాడుకుంటామన్నది ముఖ్యమని వ్యాఖ్యానించాడు.
77
‘జట్టులో ఉన్న పలువురు వికెట్ కీపర్లు మంచి బ్యాటర్లు కూడా. వాళ్లు ఏ రోల్ లో అయినా బాగా సూటవుతారు. వాళ్లు కేవలం వికెట్ కీపర్లుగానే లేరు. మీరు రాహుల్ ను తీసుకోండి. అతడు వికెట్ కీపర్ తో పాటు నాణ్యమైన ఓపెనింగ్ బ్యాటర్. రిషభ్ పంత్ ఓపెనర్ గానే గాక మిడిలార్డర్ లో హిట్టర్ గా రాణిస్తాడు. పినిషర్ గా దినేశ్ కార్తీక్ ఉండనే ఉన్నాడు..’ అని తెలిపాడు.