Published : Feb 20, 2022, 04:28 PM ISTUpdated : Feb 20, 2022, 04:30 PM IST
Chetan Sharma Comments On Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తదుపరి ఐపీఎల్ సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. భారత జట్టులో చోటు కోల్పోయిన అతడు.. ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కుంటున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ స్పందిస్తూ...
గత కొద్దికాలంగా టీమిండియాలో చోటు దక్కక ఇబ్బందులు పడుతున్న ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా.. ఫిట్నెస్ నిరూపించుకోకపోతే తిరిగి జట్టులోకి రావడం కష్టమే అని బోర్డు పెద్దలు ఇప్పటికే స్పష్టం చేశారు.
28
ఇటీవల ముగిసిన వెస్టిండీస్ వన్డే సిరీస్ తో పాటు ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్ లో కూడా అతడికి చోటు దక్కలేదు. త్వరలో జరుగబోయే శ్రీలంక సిరీస్ కు కూడా సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు.
38
ఇదే విషయమై బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మెన్ చేతన్ శర్మ కూడా స్పందించాడు. అతడు మాట్లాడుతూ... ‘చూడండి.. హార్ధిక్ పాండ్యా భారత జట్టులో కీలక సభ్యుడు. అందులో అనుమానమేం లేదు. కానీ గాయాల పాలైన తర్వాత అతడు ఇప్పుడు వంద శాతం ఫిట్ గా లేడు.
48
అతడు ఫిట్నెస్ నిరూపించుకున్న తర్వాత పాండ్యా బౌలింగ్ చేస్తేనే మేం అతడిని జట్టులోకి తీసుకునేందుకు పరిగణనలోకి తీసుకుంటాం..’ అని తెలిపాడు.
58
గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన పాండ్యా.. రంజీలకు వెళ్లి నిరూపించుకోవాలని సీనియర్ సెలెక్షన్ కమిటీ ఆదేశించింది. కానీ అతడు మాత్రం రంజీలు ఆడటం లేదు.
68
త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్ సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. పాండ్యా ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కు సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
78
పాండ్యా రంజీలు ఆడకపోవడంపై చేతన్ శర్మ స్పందిస్తూ... ‘ఒకవేళ ఎవరైనా రంజీలు ఆడకుంటే (పాండ్యాను ఉద్దేశిస్తూ..) దానికి సెలెక్షన్ కమిటీ జోక్యం చేసుకోదు. అది రాష్ట్రానికి సంబంధించిన విషయం.
88
పాండ్యా రంజీలు ఎందుకు ఆడటం లేదో అతడిని అడగాలి. రంజీలలో ఎవరు భాగా ఆడుతున్నారు..? అని చూసి వారి ప్రదర్శన ఆధారంగా జాతీయ జట్టుకు సెలెక్ట్ చేస్తాం. రంజీలలో భాగా ఆడేవారిని మేం కచ్చితంగా గుర్తిస్తాం...’ అని తెలిపాడు.