టీమిండియాకి ఆడాలంటే ఇది సరిపోదా? ఇంకా ఏం చేయాలి? సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడంపై...

Published : Feb 20, 2022, 03:09 PM IST

ఐపీఎల్‌లో పాకెట్ డైనమేట్‌లా క్రికెట్ ఫ్యాన్స్‌ దృష్టిని ఆకర్షించాడు సర్ఫరాజ్ ఖాన్. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ వంటి జట్లకి ఆడిన సర్ఫరాజ్ ఖాన్‌ని ఈసారి వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది...

PREV
111
టీమిండియాకి ఆడాలంటే ఇది సరిపోదా? ఇంకా ఏం చేయాలి? సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడంపై...

ముంబై తరుపున రంజీ ట్రోఫీ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్, గత 9 ఇన్నింగ్స్‌ల్లో కలిసి 199.16 యావరేజ్‌తో 1195 పరుగులు చేశాడు...

211

రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో సౌరాష్ట్రతో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో 401 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 275 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు సర్ఫరాజ్ ఖాన్...

311

12 ఇన్నింగ్స్‌ల్లో ఓ సెంచరీ (177 పరుగులు), రెండు డబుల్ సెంచరీలు (226 నాటౌట్, 275 నాటౌట్), ఓ త్రిబుల్ సెంచరీ (301 నాటౌట్), మూడు హాఫ్ సెంచరీలు (71*, 78, 71* ) నమోదు చేశాడు...

411

అయినా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ని, శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్‌కి ఎంపిక చేయలేదు బీసీసీఐ సెలక్టర్లు...

511

అలాగే ఐపీఎల్ 2021 సీజన్ ఆరెంజ్ క్యాప్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్, భారత జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు...

611

మహారాష్ట్ర తరుపున రంజీ మ్యాచులు ఆడే రుతురాజ్ గైక్వాడ్, గత ఆరు మ్యాచుల్లో 154.66 సగటుతో 952 పరుగులు చేసి అదరగొట్టాడు...

711

‘సెలక్టర్లు ఎలా ఆలోచిస్తున్నారో, ఏ ప్రామాణికాలను దృష్టిలో పెట్టుకుని ప్లేయర్లను సెలక్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు...

811

దేశవాళీ టోర్నీల్లో సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్ భీకరమైన ఫామ్‌లో ఉన్నారు. అయినా ఈ ఇద్దరినీ శ్రీలంకతో టెస్టు సిరీస్‌కి ఎంపిక చేయలేదు...

911

లంక సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో కొందరు ప్లేయర్లు, కనీస అర్హత కూడా లేకుండా చోటు దక్కించుకోగలిగారు...

1011

భారత జట్టులోకి రావాలంటే ఏ ప్లేయర్ అయినా కష్టపడి  అర్హత సాధించుకోవాలి. అంతే కానీ ఈజీగా ఇచ్చేయకూడదు...

1111

రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్... భారత జట్టులో ఉండేందుకు అన్ని విధాల అర్హులు. టీమిండియాకి వారిని ఎంపిక చేయకుండా జట్టు విలువలను నాశనం చేస్తున్నారు సెలక్టర్లు...’ అంటూ వ్యాఖ్యానించాడు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్...

click me!

Recommended Stories