విడాకుల తర్వాత తొలిసారి కొడుకుని కలిసిన శిఖర్ ధావన్... ఎమోషనల్ అయ్యానంటూ...

Published : Feb 20, 2022, 04:25 PM IST

భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, భార్య అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకుని వేరు పడిన విషయం తెలిసిందే. ఆగస్టు 2020 తర్వాత తొలిసారిగా తన కొడుకు జోరావర్‌ని కలిసాడు శిఖర్ ధావన్...

PREV
114
విడాకుల తర్వాత తొలిసారి కొడుకుని కలిసిన శిఖర్ ధావన్... ఎమోషనల్ అయ్యానంటూ...

ఆగస్టు 2020లో ఆస్ట్రేలియా వెళ్లిన గబ్బర్ కొడుకు జోరావర్, కరోనా నిబంధనల కారణంగా కలవలేకపోయాడు శిఖర్ ధావన్...

214

ఆ తర్వాత భార్య అయేషా ముఖర్జీతో విడాకుల కారణంగా ఈ దూరం మరింత పెరిగింది. ఎట్టకేలకు విండీస్‌తో వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత దొరికిన గ్యాప్‌లో ఆస్ట్రేలియా వెళ్లి కొడుకుని కలిశాడు శిఖర్ ధావన్...

314

‘నా కొడుకుని కలిసి దాదాపు రెండేళ్లు అవుతోంది. వాడితో ఆడుకుని, వాడిని గట్టిగా కౌగిలించుకుని, వాడితో మాట్లాడి... చాలా ఎమోషనల్ అయిపోయా... ఇలాంటి మూమెంట్స్ జీవితాంతం గుర్తుండిపోతాయి...’ అంటూ రాసుకొచ్చాడు శిఖర్ ధావన్...

414

భారత ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్‌గా శిఖర్ ధావన్ గత 6 సీజన్లుగా ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. 

514

వరుసగా 6 సీజన్లలో 400+ పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచిన ధావన్, వరుసగా రెండు సీజన్లు ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు. 

614

అయితే ఐపీఎల్‌ 2021 సెకండ్ ఫేజ్‌కి ముందు శిఖర్ ధావన్ వైవాహిక జీవితంలో అలజడి వచ్చింది... భార్య అయేషాతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు శిఖర్ ధావన్. 

714

ఫేస్‌బుక్‌లో కలిసి అయేషా ముఖర్జీని ప్రేమించి, పెళ్లాడిన శిఖర్ ధావన్... 8 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు...

814

తన కంటే వయసులో పదేళ్లు పెద్దది, ఇద్దరు పిల్లల తల్లి అయిన అయేషాను ఏరికోరి ప్రేమించి, పెళ్లాడాడు శిఖర్ ధావన్. అయితే ఈ ఇద్దరి వైవాహిక జీవితానికి విడాకుల రూపంలో 8 ఏళ్లకే ఫుల్‌స్టాప్ పడింది...

914

ప్రొఫెషనల్ కిక్ బాక్సర్ అయిన అయేషా,  తొలుత ఓ ఆస్ట్రేలియా బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లాడింది. వీరికి 2000 సంవత్సరంలో ఆలియా, 2005లో రియా అనే ఇద్దరు కూతుర్లు కూడా జన్మించారు...

1014

అయితే వీరి వివాహ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. భర్తతో విడిపోయి, పిల్లలతో కలిసి జీవిస్తున్న అయేషా ముఖర్జీని... భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో చూసిన శిఖర్ ధావన్, చూడగానే తను ప్రత్యేకంగా అనిపించడంతో ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు..

1114

అలా ఏర్పడిన పరిచయం... స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారి మూడు ముళ్ల బంధంగా మారింది. ఈ ఇద్దరికీ ఓ బాబు కూడా జన్మించాడు... అతనే జోరావర్. 

1214

సెంచరీ చేసినా, క్యాచ్ పట్టినా, డకౌట్ అయినా ముఖంపై చిరునవ్వు చెదరనివ్వని శిఖర్ ధావన్, వ్యక్తిగత జీవితంలో వచ్చిన అలజడితో మానసికంగా కృంగిపోయాడట.

1314

అయితే కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్న శిఖర్ ధావన్, డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి తనని తాను బిజీగా ఉంచుకోవాలని ఫిక్స్ అయ్యాడట...

1414

విడాకుల తర్వాత ‘జీవితంలో ఏదైనా సాధించాలంటే దానిపై నీకున్న పూర్తి శక్తి సామర్థ్యాలను పెట్టాలి. అలాగే మనసు కూడా... నువ్వు చేసే పనిని ప్రేమించాలి... నువ్వు వేసే ప్రతీ అడుగునీ ఎంజాయ్ చేయాలి...’ అంటూ రాసుకొచ్చాడు శిఖర్ ధావన్...

click me!

Recommended Stories