బెస్ట్‌ ప్లేయరే నువ్వే బెస్ట్ అన్నాక ఇక డిస్కర్షన్ వేస్ట్... సూర్యకుమార్ యాదవ్‌‌పై కోహ్లీ ట్వీట్...

Published : Nov 21, 2022, 09:59 AM ISTUpdated : Nov 21, 2022, 10:00 AM IST

టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నిలకడైన పర్ఫామెన్స్‌తో అదరగొడుతున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఈ ఏడాది టీ20ల్లో రికార్డు లెవెల్‌లో పరుగులు చేస్తూ దూసుకుపోతున్న సూర్యకుమార్ యాదవ్... న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో మెరుపు సెంచరీ సాధించాడు...

PREV
16
బెస్ట్‌ ప్లేయరే నువ్వే బెస్ట్ అన్నాక ఇక డిస్కర్షన్ వేస్ట్... సూర్యకుమార్ యాదవ్‌‌పై కోహ్లీ ట్వీట్...
Virat Kohli-Suryakumar Yadav

2022లో సూర్యకుమార్ యాదవ్‌కి ఇది రెండో టీ20 సెంచరీ. 2018లో రోహిత్ శర్మ ఒకే ఏడాదిలో రెండు టీ20 శతకాలు బాదగా, ఈ ఫీట్ సాధించిన రెండో భారత బ్యాటర్ సూర్య... 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్... ఆఖరి ఓవర్‌లో స్ట్రైయిక్ దక్కి ఉంటే మరో 10-15 పరుగులు ఈజీగా చేసేవాడు...

26

15 ఓవర్లు ముగిసే సమయానికి 31 బంతుల్లో 49 పరుగులు మాత్రమే చేసిన సూర్యకుమార్ యాదవ్, ఆఖరి 5 ఓవర్లలో 20 బంతులు ఎదుర్కొని 62 పరుగులు చేశాడు. ఆఖరి 5 ఓవర్లలో 50+ స్కోర్ రాబట్టడం సూర్యకి ఇది మూడోసారి...మిగిలిన భారత బ్యాటర్లు ఎవ్వరూ ఇన్ని సార్లు ఈ ఫీట్ సాధించలేకపోయారు...

36
SuryaKumar Yadav, Virat Kohli, T20I

రెండో టీ20 సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్‌ని ట్వీట్‌తో అభినందించాడు విరాట్ కోహ్లీ. ‘నుమెరో యూనో (స్పానిష్‌లో నెం.1 అని అర్థం) వరల్డ్‌లో తాను బెస్ట్ ఎందుకో మరోసారి చూపిస్తున్నాడు. లైవ్ మ్యాచ్ చూడలేదు కానీ అతని నుంచి మరో వీడియో గేమ్ ఇన్నింగ్స్ అని తెలుస్తోంది...’ అంటూ ట్వీట్ చేశాడు విరాట్ కోహ్లీ...

46
Image credit: Getty

ప్రస్తుత తరంలో 71 అంతర్జాతీయ సెంచరీలు చేసి, టీ20ల్లో 4 వేల పరుగులు అందుకున్న మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ... ది బెస్ట్ ప్లేయర్‌ అంటూ సూర్యకుమార్ యాదవ్‌ని మెచ్చుకోవడంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది...

56

టీ20ల్లో బెస్ట్ ప్లేయర్ అనే విషయంపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. పాక్ బ్యాటర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌లతో పాటు జోస్ బట్లర్, రోహిత్ శర్మ కూడా ఈ రేసులో ఉన్నారు. అయితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో బాబర్ అండ్ కో విఫలం కాగా విరాట్ కోహ్లీ బ్యాటుతో అదరగొట్టి 296 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సూర్య సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు...

66
Suryakumar Yadav

ది బెస్ట్ ప్లేయర్‌ అయిన విరాట్ కోహ్లీయే సూర్యకుమార్ యాదవ్‌ని బెస్ట్ ప్లేయర్‌ అని అనడంతో ఇక బెస్ట్ టీ20 ప్లేయర్ ఎవరు అంటూ వేస్ట్ డిస్కర్షన్ అవసరం లేదని అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుత తరంలో సూర్యనే ది బెస్ట్ టీ20 బ్యాటర్ అంటూ ఫిక్స్ అయిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు... 

Read more Photos on
click me!

Recommended Stories