ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో పెళ్లీల ట్రెండ్ నడుస్తున్నది. పదేండ్ల పాటు డేటింగ్ చేసిన రిచా చద్దా, అలీ ఫజల్ లు ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. రెండ్రోజుల క్రితమే అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ నిశ్చితార్థం జరిగింది. ఆషికీ 2 గాయకురాలు పాలక్ ముచ్చల్ కూడా త్వరలోనే పెళ్లిపీఠలెక్కబోతున్నది. రస్నా బేబీ హన్సిన మోత్వానీ కూడా వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నది. ఈ జాబితాలోనే అతియా కూడా చేరడం విశేషం.