Year in Sports: 2023లో బద్దలైన టాప్-5 క్రికెట్ రికార్డులు

First Published | Dec 31, 2023, 10:06 AM IST

5 Notable International Cricket Records: 2023లో భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ అనేక రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు. అలాగే, స‌రికొత్త రికార్డులు సైతం సృష్టించాడు. ఈ ఏడాది గుర్తించద‌గిన టాప్-5 అంత‌ర్జాతీయ క్రికెట్ రికార్డులు గ‌మ‌నిస్తే.. 
 

Virat Kohli

Year Ender 2023 sports: 2023లో ఆటగాళ్లు చరిత్రలో తమదైన ముద్ర వేయడంతో అనేక‌ క్రికెట్ రికార్డులు బ‌ద్ద‌ల‌య్యాయి. ఈ ఏడాదిలో ఏకంగా మూడు ప్ర‌ధాన ఐసీసీ ఈవెంట్లు జ‌ర‌గ‌డంతో ఆట‌గాళ్లు అద‌ర‌గొట్టారు. అనేక మంది క్రీడాకారులు ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర పుటల్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 2023లో బద్దలు కొట్టిన గుర్తించ‌ద‌గిన టాప్-5 రికార్డులు గ‌మ‌నిస్తే..

5. అంత‌ర్జతీయ టీ20 క్రికెట్ లో వేగవంతమైన హాఫ్ సెంచరీ
 
నేపాల్ కు చెందిన దేవేంద్ర సింగ్ ఐరీ టీ20 క్రికెట్ లో అత్యంత వేగ‌వంత‌మైన  హాఫ్ సెంచరీ ని న‌మోదుచేశాడు. అంత‌కుముందు భారత స్టార్ ప్లేయ‌ర్ యువరాజ్ సింగ్ 16 ఏళ్ల క్రితం ఈ రికార్డును సృష్టించారు. ఆసియా గేమ్స్ 2023లో మంగోలియాతో జరిగిన తొలి గ్రూప్ మ్యాచ్ లో ఐరీ ఈ ఘనత సాధించాడు. కేవలం 10 బంతుల్లో 52 పరుగులు చేసి, కేవలం 9 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. తన ఇన్నింగ్స్ లో ఎనిమిది సిక్సర్లు బాదాడు.
 


Kushal Malla

4. టీ20 చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ

మంగోలియాతో జరిగిన ఆసియా గేమ్స్ మ్యాచ్ లో నేపాల్ కు చెందిన కుశాల్ మల్లా కేవలం 34 బంతుల్లోనే అంతర్జాతీయ టీ20ల్లో వేగవంతమైన సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మలు అంత‌కుముందు 35 బంతుల్లో ఈ ఘనత సాధించారు.
 

Nepal Cricket

3. అంతర్జాతీయ  టీ20ల్లో జ‌ట్టుగా టాప్ స్కోర్.. 

ఆసియా గేమ్స్ 2023 ప్రారంభ మ్యాచ్ లొ నేపాల్ 314/3 భారీ స్కోరుతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక  స్కోరు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. కుశాల్ మల్లా, రోహిత్ పౌడెల్, దీపేంద్ర సింగ్ ఐరీల అద్భుత ప్రదర్శనతో అఫ్గానిస్థాన్ మునుపటి 278/3 రికార్డును అధిగమించింది.
 

2. వన్డే చరిత్రలో అత్యధిక సెంచరీలు

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ తన ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 117 (113) పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ను ప్రదర్శించి కేవలం 279 ఇన్నింగ్స్ ల్లోనే ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాడు. వ‌న్డేల‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ప్లేయ‌ర్ గా నిలిచాడు. 
 

1. అంతర్జాతీయ టీ20 చరిత్రలో టాప్ రన్ ఛేజింగ్

2023లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 259 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి టీ20ల్లో అత్యధిక పరుగుల ఛేజింగ్ ను పూర్తి చేసింది. జాన్సన్ చార్లెస్ అద్భుత సెంచరీ (46 బంతుల్లో 118) సారథ్యంలో వెస్టిండీస్ 258/5 స్కోరు చేసింది. క్వింటన్ డికాక్ 44 బంతుల్లో సెంచరీ, రీజా హెండ్రిక్స్ 68 (28) రాణించడంతో దక్షిణాఫ్రికా 18.5 ఓవర్లలో 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
 

Latest Videos

click me!