IND vs SA: రెండో టెస్టులో గెలవాలంటే టీమిండియాలో ఆ మార్పులు చేయాల్సిందే.. సునీల్ గవాస్కర్

First Published | Dec 30, 2023, 4:51 PM IST

IND vs SA 2nd Test: సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్న టీమిండియా ఇప్పుడు కేప్ టౌన్ లో జరిగే రెండో టెస్టులో గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేయడంపై దృష్టి సారించింది. అయితే, ఇది జ‌ర‌గాలంటే టీంలో రెండు ప్ర‌ధాన మార్పులు చేయాల‌ని భార‌త దిగ్గ‌జ క్రికెట‌ర్ సునీల్ గవాస్కర్ అన్నారు.
 

Rohit Sharma, Sunil Gavaskar

Sunil Gavaskar: ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో టీ20, వ‌న్డేల‌లో అద‌ర‌గొట్టిన భార‌త్.. బాక్సింగ్ డే టెస్టులో మాత్రం ఘోరంగా ఓడింది. సెంచూరియ‌న్ లో జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచ్ లో భార‌త్ ఇన్నింగ్స్ 32 ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికా చేతితో దారుణంగా పరాజ‌యం పాలైంది. అయితే, సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచే అవకాశాన్ని మ‌రోసారి చేజార్చుకున్న టీమిండియా ఇప్పుడు కేప్ టౌన్ లో జరిగే రెండో టెస్టులో గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేయడంపై దృష్టి సారించింది. 

Sunil Gavaskar

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 1992 తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. రెండో టెస్టులో విజయం సాధించాలంటే టీమిండియా రెండు కీలక మార్పులు చేయాల్సి ఉంటుందని భార‌త దిగ్గ‌జ ప్లేయ‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ అన్నారు. 

Latest Videos


Indian Team

భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్ ల‌ సిరిస్ లో భాగంగా రెండో మ్యాచ్  కేప్ టౌన్ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు జరగనుంది. కేప్ టౌన్ లో టీమిండియా గెలిస్తే సిరీస్ ను 1-1తో సమం చేస్తుంది. 2010-11 పర్యటనలో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా గడ్డపై ఏకైక టెస్టు సిరీస్ ను భారత్ డ్రా చేసుకుంది.
 

1992 పర్యటనతో సహా దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఇప్పటివరకు మొత్తం 8 టెస్టు సిరీస్ లు ఆడింది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఆడిన 8 టెస్టు సిరీస్ లలో 7 ఓడింది. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా గడ్డపై జరిగే 8వ టెస్టు సిరీస్ ను కోల్పోకుండా ఉండాలని భారత్ భావిస్తోంది. 
 

Mukesh Kumar

దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్టు కోసం భారత జట్టులో రెండు మార్పులు చేయాల్సి ఉంటుందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. రెండో టెస్టుకు భారత జట్టులో రవీంద్ర జడేజా, ముఖేష్ కుమార్లకు చోటు కల్పించాలని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. రెండో టెస్టుకు రవీంద్ర జడేజా ఫిట్ గా ఉన్నాడని సమాచారం.
 

Team India

కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకు భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ మార్పుపై సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ రవీంద్ర జడేజా రెండో మ్యాచ్ కు ఫిట్ గా ఉంటాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు. ప్లేయింగ్ ఎలెవన్ లో ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో రెండో మార్పు వచ్చే అవకాశం ఉంది. అయితే ముందుగా కేప్ టౌన్ పిచ్ ఎలా ఉంటుందో చూడాలి. పిచ్ ను దృష్టిలో ఉంచుకుని ప్లేయింగ్ 11ను మార్చవచ్చున‌ని తెలిపాడు. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు కేప్ టౌన్ వేదిక‌గా దక్షిణాఫ్రికాతో జరిగిన ఒక్క టెస్టు మ్యాచ్ లోనూ భారత్ గెలవలేదు.

click me!