most international runs in a calender year: ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సార్లు 2000 పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో భారత్ నుంచి విరాట్ కోహ్లీ టాప్ లో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఇప్పటికే వరకు అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సార్లు 2000 పరుగులు చేసిన ప్లేయర్లు వివరాలు ఇలా ఉన్నాయి..
విరాట్ కోహ్లీఒక క్యాలెండర్ ఇయర్‌లో ఏడుసార్లు 2000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించారు. విరాట్ కోహ్లీ 2012, 2014, 2016, 2017 2018, 2019, 2023 సంవత్సరాల్లో 2000 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
210
2. కుమార్ సంగక్కర
శ్రీలంక స్టార్ ప్లేయర్ కుమార్ సంగక్కర విరాట్ కోహ్లీ కంటే ముందు ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు 2000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సంగక్కర 2004, 2006, 2009, 2011, 2012, 2013లో ఈ ఘనత సాధించాడు.
310
3. సచిన్ టెండూల్కర్
క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో ఐదు సార్లు క్యాలెండర్ ఇయర్‌లో 2000 పరుగులు చేశాడు. 1996, 1997, 1998, 2002, 2007లో టెండూల్కర్ ఈ ఘనత సాధించాడు.
410
Mahela Jayawardena
4. మహేల జయవర్ధనే
శ్రీలంక దిగ్గజ ప్లేయర్ మహేల జయవర్ధనే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ శ్రీలంక ఆటగాళ్లు, కెప్టెన్లలో ఒకడు. జయవర్ధనే 2001, 2006, 2007, 2009, 2013 సంవత్సరాలలో అంతర్జాతీయ క్రికెట్ లో 2000 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
510
Jacques Kallis
5. జాక్ కాలిస్
దక్షిణాఫ్రికా దిగ్గజ ప్లేయర్ జాక్ కాలిస్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడు. జాక్ కాలిస్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు సార్లు 2000 పరుగులు చేశాడు. 2000, 2004, 2007, 2010లో కల్లిస్ ఈ మైలురాయిని అందుకున్నాడు.
610
ricky ponting
6. రికీ పాంటింగ్
ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా అంతర్జాతీయ క్రికెట్ లో నాగులు వేరువేరు సంవత్సరాల్లో 2 వేల పరుగులు మైలురాయిని అందుకున్నాడు. పాంటింగ్ 2003, 2005 2006, 2009లలో 2000 పరుగులు చేశాడు.
710
Sourav Ganguly
7. సౌరవ్ గంగూలీ
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంతర్జాతీయంగా నాలుగు సార్లు 2000 పరుగులు చేశాడు. గంగూలీ 1997, 1999, 2002, 2007లో ఈ మైలురాయిని అందుకున్నాడు.
810
Matthew Hayden
8. మాథ్యూ హేడెన్
ఆస్ట్రేలియా ప్లేయర్ మాథ్యూ హేడెన్ తన కెరీర్‌లో నాలుగు సార్లు 2000 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 2002, 2003, 2003, 2007లో హేడెన్ ఈ ఘనత సాధించాడు.
910
9. రాహుల్ ద్రవిడ్
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మూడుసార్లు 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ద్రవిడ్ 1999, 2002, 2006లో ఈ మైలురాయిని అందుకున్నాడు.
1010
Joe Root
10. జో రూట్
ఇంగ్లీష్ బ్యాటింగ్ టాలిస్మాన్ జో రూట్ తన కెరీర్‌లో 2015, 2016, 2017లో మూడుసార్లు 2000 అంతర్జాతీయ పరుగులు సాధించాడు.