Year Ender 2021: డేల్ స్టెయిన్ నుంచి భజ్జీ దాకా.. ఈ ఏడాది రిటైరైన ఫేమస్ క్రికెటర్లు వీళ్లే..

Published : Dec 27, 2021, 04:59 PM IST

2021 Round Up: ఏ క్రికెటర్‌కైనా అంతర్జాతీయ స్థాయిలో తన దేశానికి ప్రాతినిధ్యం వహించడం ముఖ్యం. ఈ క్రమంలో కొంతమంది ఆటగాళ్ళు తమకు లభించిన అవకాశాన్ని ఉపయోగించుకుని స్టార్ ప్లేయర్‌లుగా ఎదుగుతారు. అయితే ఏదో ఒక సందర్భంలో ఆ ఆటగాళ్లందరూ రిటైర్మెంట్ అనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకోక తప్పదు. మరి 2021లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన అగ్రశ్రేణి ఆటగాళ్ల వివరాలను ఇక్కడ చూద్దాం.. 

PREV
110
Year Ender 2021: డేల్ స్టెయిన్ నుంచి భజ్జీ దాకా..  ఈ ఏడాది రిటైరైన ఫేమస్ క్రికెటర్లు వీళ్లే..

1. ఉపుల్ తరంగ : శ్రీలంక లెఫ్టార్మ్ ఓపెనర్ ఉపుల్ తరంగ 2005లో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు. అతడు శ్రీలంక తరఫున 31 టెస్టులు, 235 వన్డేలు, 26 టీ20లు ఆడాడు. 235 వన్డేలలో 15 సెంచరీలు, 37 అర్ధసెంచరీలతో 6,951 పరుగులు చేశాడు.

210

2011 వన్డే  ప్రపంచకప్ లో తరంగ కీలక పాత్ర పోషించాడు. అంతేగాక అతడు 2016 నుంచి 2018 వరకు శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.ఈ  ఏడాది ఫిబ్రవరి 23న ఉపుల్ తరంగ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

310
Dale Steyn

2. డేల్ స్టెయిన్ : సఫారీ స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్ కూడా 2021లోనే క్రికెట్ కు వీడ్కోలు ప్రకటించి 16 ఏళ్ల కెరీర్‌కు స్వస్థి పలికాడు. 2004లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్టెయిన్.. సౌతాఫ్రికా తరఫున 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడాడు.

410

డేల్ స్టెయిన్ ICC టెస్ట్ ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో 2008 నుండి 2014 వరకు అగ్రస్థానంలో కొనసాగాడు. తన టెస్టు కెరీర్ లో డేల్ స్టెయిన్ 439 వికెట్లు తీశాడు. వన్డేలలో 196, టీ20లలో 64 వికెట్లు పడగొట్టాడు. ఎట్టకేలకు ఆగస్టు 31న అంతర్జాతీయ క్రికెట్‌కు డేల్ స్టెయిన్ వీడ్కోలు పలికాడు.

510

3. డ్వేన్ బ్రావో : ఇటీవలే ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో గ్రూప్‌ దశ నుంచి వెస్టిండీస్‌ నిష్క్రమించడంతో ఆ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వెస్టిండీస్ తరఫున బ్రావో.. 40 టెస్టులు, 164 వన్డేలు, 91 టీ20లు ఆడాడు.

610

40 టెస్టులలో 86 వికెట్లు తీసిన ఈ ట్రినిడాడ్ స్టార్.. వన్డేలలో 199 వికెట్లు, టీ20లలో 81 వికెట్లు పడగొట్టాడు. ఇక బ్యాటింగ్ లో.. టెస్టులలో 2,200  పరుగులు చేశాడు. వన్డేలలో 2,968 రన్స్, టీ20లలో 1,255 పరుగులు చేశాడు. 

710

4. తిసారా పెరీరా : శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ తిసార పెరీరా డిసెంబర్ 2009 లో భారత్‌పై జరిగిన మ్యాచులో అరంగేట్రం చేశాడు. పెరీరా దశాబ్దాలుగా శ్రీలంక పరిమిత ఓవర్ల జట్టులో అంతర్భాగంగా ఉన్నాడు.  శ్రీలంక తరఫున 6 టెస్టులు, 166 వన్డేలు, 84 టీ20లు ఆడాడు. 

810

వన్డేలలో 175 వికెట్లు, 51 టీ20 వికెట్లు తీశాడు. అంతేగాక వన్డేలలో 2,338 పరుగులు.. టీ20లో 1,204 పరుగులు చేశాడు.పెరీరా.. మే 03న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 

910

5. హర్భజన్ సింగ్ : భారతదేశం అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా పేరుగాంచిన  హర్భజన్ సింగ్ కూడా ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 1998లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన భజ్జీ..  2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్ కూడా భజ్జీనే..

1010

భారత జట్టు 2007లో నెగ్గిన తొలి T20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ జట్టులో భజ్జీ సభ్యుడు. తన కెరీర్ లో 103 టెస్టుల్లో 417 వికెట్లు, 236 వన్డేల్లో 269 వికెట్లు, 28 టీ20 మ్యాచుల్లో 25 వికెట్లు తీశాడు. భజ్జీ డిసెంబర్ 24న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 

Read more Photos on
click me!

Recommended Stories